emergency land
-
విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన విమానం ఒకటి విశాఖ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దిగినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల ప్రయాణానికి సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఢిల్లీ-పోర్టుబ్లెయిర్ ఎయిర్ఇండియా విమానం మొత్తం 270 మంది ప్రయాణికులతో బయల్దేరింది. గత రాత్రి స్థానికంగా ఓ హోటల్లో వాళ్లకు వసతి ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల్లో మెడికల్ కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన వాళ్లు సైతం అందులో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిణామంపై సాక్షి టీవీతో ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. ‘‘నిన్న ఉదయం 05:30 నిమిషాలకి ఢిల్లీ నుంచి ఏయిర్ ఇండియా బయలు దేరింది. ఆ తరువాత రెండు సార్లు అండమన్ లో పైలెట్ ఫ్లైట్ ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. పైలెట్ కి తగిన నైపుణ్యం లేక పోవడం తో లాండ్ చెయ్యలేక పోయారు. అండమాన్ రన్ వే చిన్న గా ఉంటుంది.. నైపుణ్యం కలిగిన పైలెట్ లేక పోవడం తో సేఫ్ ల్యాండ్ చెయ్యలేక పోయారు. మా లగేజ్ కి సరైన భద్రత కూడా కల్పించలేక పోయారు. ఎయిర్ ఇండియా పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారామె. -
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్
ఢిల్లీ: ఎయిరిండియాకు చెందిన విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భారత కాలమానం ప్రకారం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది ఎయిర్ఇండియా సిబ్బంది ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించామని, రష్యా మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో అది సురక్షితంగానే ల్యాండ్ అయినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రయాణికులు ఎలాంటి అంతరాయం లేకుండా తమ తమ గమ్యస్థానాలు చేర్చేందుకు వీలైనంత త్వరగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. Air India flight AI173 operating from Delhi to San Francisco developed a technical issue with one of its engines. The flight with 216 passengers and 16 crew was diverted and landed safely at Magadan airport in Russia. The passengers are being provided with all support on ground… https://t.co/Sq6RmNzbea — ANI (@ANI) June 6, 2023 -
ఆకాశంలో ఆగిన విమాన ఇంజన్.. తప్పిన ముప్పు
ముంబై: విమాన ప్రయాణికులకు ఈ మధ్యకాలంలో వరుస ఝలక్‌లు తగులుతున్నాయి. తాజాగా గురువారం మరో ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా విమానం ఒకటి టేకాఫ్ అయిన అరగంటకే తిరిగి అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-639 విమానం ఉదయం పది గంటల ప్రాంతంలో ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే 27 నిమిషాల తర్వాత ఇంజన్లలో ఒకదానికి సమస్య తలెత్తింది. అధిక ఎగ్జాస్ట్ గ్యాస్ ఉష్ణోగ్రతల కారణంగా.. ఇంజన్ షట్ డౌన్ అయ్యింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ముంబైలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ప్రయాణికులు అందోళనకు లోనయ్యారు. ఇంజన్‌పై పీడనం పెరగడంతో ఆగిపోయినట్లు పైలెట్ గుర్తించారని, వెంటనే తిరిగి ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరుకు చేర్చామని తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విచారణకు ఆదేశించింది. చదవండి: బతికున్న మనిషి చనిపోయినట్లు నమ్మించి.. -
పదే పదే గ్యాస్ వదలుతున్నాడంటూ...
-
గ్యాస్ వదలుతున్నాడంటూ...
వియన్నా : కొన్ని మనకు చెప్పి రావు. ఎంత నియంత్రించుకున్న అలాంటి వాటి విషయంలో మనమేం చెయ్యగలిగింది ఏం లేదు. సరిగ్గా అలాంటి సమస్యతో బాధపడుతున్న ఓ పెద్దాయన ఇక్కడ విమానంలో రచ్చ రచ్చ రేపాడు. పదే పదే గ్యాస్ వదులుతున్నాడంటూ ఓ వ్యక్తితో ప్రయాణికులు గొడవకు దిగగా.. ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ జట్టు పీకున్నాడు. డచ్ ఎయిర్ లైన్స్ ట్రాంసవియాకు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి అమస్టర్‌డామ్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ ప్రయాణికుడు పదే పదే ‘గ్యాస్’ వదులుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలిగించింది. అదే వరుసలో కూర్చున్న ఇద్దరు మహిళలతోపాటు మరో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందికి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆ నలుగురు సదరు పెద్దాయనతో గొడవకు దిగారు. ఈ వ్యవహారంతో ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ వియన్నాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గొడవ పడ్డ నలుగురిని దించేసి.. ఆపై ఫ్లైట్ తిరిగి బయలుదేరినట్లు సమాచారం. అక్కడి నుంచి వారిని ప్రత్యామ్నయ మార్గంలో అమస్టర్‌డామ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత గొడవకు కారణమైన ఆ వ్యక్తిని తిరిగి ఫ్లైట్ ఎక్కించుకున్నారా? లేక అతన్ని కూడా దించేశారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. -
ఈ వార్త చదివేందుకు కూడా బాగోదేమో..!
న్యూయార్క్ : ఓ ప్రయాణీకుడి చేష్టలకు గాల్లో ఎగురుతున్న విమానాన్ని అనూహ్యంగా దించివేశారు. అనంతరం అందులోని ప్రయాణీకులందరిని దింపేసి వారికి హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేసి విమానాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆలస్యంగా బయలుదేరి ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చారు. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన విమానం 895 చికాగో నుంచి హాంకాంగ్ బయలుదేరింది. అయితే, ప్రయాణం మధ్యలో ఉండగా అందులోని ఓ ప్రయాణీకుడి టాయిలెట్‌కు వెళ్లాడు. అనంతరం విచిత్రంగా ప్రవర్తిస్తూ మలాన్ని విమానం మొత్తానికి పూయడమే కాకుండా అందులోని ప్రయాణీకులకు కూడా అంటించాడు. దాంతో విమానంలో ఓ చెప్పవీలుకానీ పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో పాలుపోక ప్రయాణీకులు గందరగోళానికి గురవుతుండగా అప్పటికప్పుడు అలస్కాలో విమానాన్ని దించివేశారు. అందులో వారందరిని ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్స్‌కు తరలించి అనంతరం విమానం మొత్తం శుభ్రం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ ఆ ప్రయాణీకుడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని అయితే అతడు ఎందుకు విమానంలో అలా చేశాడో అని తెలుసుకునేందుకు మానసిక వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు కూడా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. -
రోడ్లపై యుద్ధ విమానాలు.. గ్రాండ్ సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై మంగళవారం ఉదయం అరుదైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు సందడి చేశాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. యుద్ధ పరిస్థితుల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సైన్యం తొలిసారిగా నడిరోడ్డుపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయించింది. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్ని సందడిని వీక్షించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి రోడ్డుకిరువైపులా నిల్చున్నారు. విమానాలు ల్యాండ్ అయిన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగినా.. ప్రమాదాలు ఏం వాటిల్లకుండా పూర్తి భద్రతా చర్యలతోనే వీటిని నిర్వహించారు. భారీ భద్రతా విమానం సీ-30తోపాటు ఏన్-32, మిరాగే 2000, సుఖోయి ఎంకేఐ ఇలా మొత్తం 20 యుద్ధ విమానాలు ఈ ప్రయోగంలో పాల్గొన్నాయి. ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ మార్షల్ వైస్ చీఫ్ ఎస్బీ డియో ప్రకటించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
హైవేలపై యుద్ధ విమానాల ల్యాండింగ్
-
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెనుప్రమాదం
న్యూఢిల్లీ: ముంబయికి చెందిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. దానిని అత్యవసరంగా దించివేశారు. ఇంజిన్‌లో తీవ్ర సమస్య తలెత్తిందని పైలెట్ గుర్తించడంతో ముందస్తుగా వెనక్కి రప్పించి దిప్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777-300 అమెరికా కాలమానం ప్రకారం 4.30గంటలకు అమెరికాలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ముంబయికి బయలుదేరింది. సరిగ్గా 29,000 అడుగుల ఎత్తులో ఉండగా విమానం మొత్తం కంపించడం ప్రారంభించడంతో అప్రమత్తమైన పైలెట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే దించేయాల్సిందిగా అధికారులు చెప్పడంతో చాకచక్యంతో వ్యవహరించిన పైలెట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే దించేశాడు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. అందులోని ప్రయాణీకులను ఢిల్లీకి చెందిన మరో విమానం ద్వారా తరలించారు. దించిన అనంతరం తనిఖీ చేయగా విమానం ఇంజిన్‌లోని ఓ బ్లేడ్ విరిగిపోయినట్లు గుర్తించారు. -
అనంతలో హెలీకాప్టర్ అత్యవసర ల్యాండింగ్
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఓ హెలీకాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలట్ కిందకు దించారు. ఈ సంఘటనలో ఏలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమింది సురక్షితంగా ఉన్నారు.