సాక్షి, విశాఖపట్నం: పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన విమానం ఒకటి విశాఖ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దిగినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల ప్రయాణానికి సంబంధించిన అప్‌డేట్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు.
ఢిల్లీ-పోర్టుబ్లెయిర్ ఎయిర్‌ఇండియా విమానం మొత్తం 270 మంది ప్రయాణికులతో బయల్దేరింది. గత రాత్రి స్థానికంగా ఓ హోటల్‌లో వాళ్లకు వసతి ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల్లో మెడికల్ కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన వాళ్లు సైతం అందులో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ పరిణామంపై సాక్షి టీవీతో ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ..
‘‘నిన్న ఉదయం 05:30 నిమిషాలకి ఢిల్లీ నుంచి ఏయిర్ ఇండియా బయలు దేరింది. ఆ తరువాత రెండు సార్లు అండమన్ లో పైలెట్ ఫ్లైట్ ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. పైలెట్ కి తగిన నైపుణ్యం లేక పోవడం తో లాండ్ చెయ్యలేక పోయారు. అండమాన్ రన్ వే చిన్న గా ఉంటుంది.. నైపుణ్యం కలిగిన పైలెట్ లేక పోవడం తో సేఫ్ ల్యాండ్ చెయ్యలేక పోయారు. మా లగేజ్ కి సరైన భద్రత కూడా కల్పించలేక పోయారు. ఎయిర్ ఇండియా పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment