
సాయంత్రం 4.15 గంటలకు విశాఖకు నరేంద్ర మోదీ
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
రోడ్డు షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్నం రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం సచివాలయం నుంచి అధికారులతో సమీక్షించారు. విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్‌గా 20 వరకూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నట్లు సీఎస్ చెప్పారు. ‘సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళతారు.’ అని సీఎస్ వివరించారు.
3 గంటలపాటు విశాఖలో...
ప్రధాని విశాఖలో మూడు గంటలపాటు ఉంటారని, వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ నుంచి కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారని సీఎస్ తెలిపారు. అక్కడ నుంచే వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ నోడ్, గుంటూరు–బీబీనగర్, గుత్తి–పెండేకల్ రైల్వే లైన్ల డబ్లింగ్ వంటి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment