విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు విమాన సర్వీసు ప్రారంభం | Flights to Port Blair from Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు విమాన సర్వీసు ప్రారంభం

Published Thu, Apr 9 2015 9:06 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు విమాన సర్వీసు ప్రారంభం - Sakshi

విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు విమాన సర్వీసు ప్రారంభం

విశాఖపట్టణం: విశాఖ విమానాశ్రయం నుంచి పోర్టుబ్లెయిర్‌కి ఎయిరిండియా విమానాన్ని గురువారం ఉదయం కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు ప్రారంభించారు. తొలి ప్రయాణికుడు రాజేష్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే పోర్టుబ్లెయిర్‌కి రోజూ సర్వీసులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. పోర్టుబ్లెయిర్‌కి ఒక ప్రయాణికుడే ఇక్కడి నుంచి బయలుదేరగా మధ్యాహ్నం 2.45కి గంటలకు తిరుగు ప్రయాణంలో 27 మంది ఇక్కడికి వచ్చారు.

ఎయిరిండియా విశాఖ విమానాశ్రయం నుంచి పోర్టుబ్లెయిర్‌కి వారానికి రెండు రోజులు (సోమ, గురువారాలు) సర్వీసులు నడుస్తాయి. ఉదయం ఢిల్లీలో 7 గంటలకు బయలుదేరి విశాఖకు 9.15 గంటలకు చేరుతుంది. ఇక్కడ 9.55గంటలకు బయలుదేరి ఢిల్లీ మీదుగా పోర్టు బ్లెయిర్‌కి 12.10 గంటలకు వెళ్తుంది. అక్కడ 12.50 గంటలకు బయలుదేరి విశాఖకు మధ్యాహ్నం 3.05కి చేరుతుంది. ఇక్కడ 3.50కి బయలేదేరి ఢిల్లీకి సాయంత్రం 6.50 గంటలకు చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement