డబుల్ డెక్కర్ రైలుకు గూడెంలో హాల్ట్
Published Mon, Dec 26 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
తాడేపల్లిగూడెం : తిరుపతి–విశాఖపట్టణం మధ్య త్వరలో ప్రారంభమయ్యే డబుల్ డెక్కర్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కల్పించారు. ఈనెల 30న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు విజయవాడలో రైలును ప్రారంభించనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. స్థానిక వాసవీ ఆడిటోరియంలో ఆదివారం బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, గమిని సుబ్బారావు తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాణిక్యాలరావు చొరవతో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించినట్టు వారు తెలిపారు. రైలు సమయాలను అధికారికంగా త్వరగా ప్రకటిస్తారన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు చలంచర్ల మురళి, వబిలిశెట్టి నటరాజ్, మంత్రి కార్యాలయ పీఆర్వో చిట్యాల రాంబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement