gudem
-
గుండేగాంపై ప్రభుత్వానికి పట్టింపేది?
భైంసా(ముథోల్): గుండేగాం గ్రామస్తుల పునరావాసంపై ప్రభుత్వానికి పట్టింపులేదని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం భైంసాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గుండేగాం, పాతమహాగాం, చింతల్బోరి గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గతేడాది గుండేగాం గ్రామంలోకి వరద నీరు చొచ్చుకువచ్చిందని, ఈఏడాది మళ్లీ అదే పరిస్థితి ఎదురైందన్నారు. అయినా.. అధికారుల్లో చలనంలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ముంపునకు గురయ్యే గ్రామాలు, నీట మునిగే పంటపొలాలను గుర్తించి పరిహారం చెల్లించాల్సిన కనీస బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మూడు రోజులుగా గుండేగాం గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారని, గ్రామంలోకి పాములు, అడవి పందులు వస్తున్నాయన్నారు. గుండేగాం గ్రామస్తులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా ముంపు బాధితులు, పునరావాస గ్రామాల వారికి పరిహారం ఇప్పించడంలో విఫలమవుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రానున్నరోజుల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తీరుస్తామన్నారు. గుండేగాం గ్రామస్తులకు పునరావాసం కల్పించి నీటమునిగే పంటపొలాలకు పరిహారం చెల్లించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
పక్కా లోకల్ !
-
డబుల్ డెక్కర్ రైలుకు గూడెంలో హాల్ట్
తాడేపల్లిగూడెం : తిరుపతి–విశాఖపట్టణం మధ్య త్వరలో ప్రారంభమయ్యే డబుల్ డెక్కర్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కల్పించారు. ఈనెల 30న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు విజయవాడలో రైలును ప్రారంభించనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. స్థానిక వాసవీ ఆడిటోరియంలో ఆదివారం బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, గమిని సుబ్బారావు తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాణిక్యాలరావు చొరవతో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించినట్టు వారు తెలిపారు. రైలు సమయాలను అధికారికంగా త్వరగా ప్రకటిస్తారన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు చలంచర్ల మురళి, వబిలిశెట్టి నటరాజ్, మంత్రి కార్యాలయ పీఆర్వో చిట్యాల రాంబాబు పాల్గొన్నారు. -
గూడెం హుండీ లెక్కింపు
దండేపల్లి : మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి ఆషాఢ పౌర్ణమి జాతర సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మొత్తం రూ.2,01,147 ఆదాయం వచ్చింది. అందులో హుండీ ద్వారా రూ.77,750, రశీదులు, ఇతరముల ద్వారా రూ.1,23,397 ఆదాయం వచ్చింది. లెక్కింపును దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు, ఆదిలాబాద్ డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు వెంకటస్వామి, ఈవో పురుషోత్తమచార్యులు, వేదపారాయణదారు నారాయణశర్మ, ఆలయ సిబ్బంది, అర్చకులు, సత్యనారాయణస్వామి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. -
బెల్ట్ షాపులు ఇంకా ఉన్నాయా?
కోయలగూడెం: డ్వాక్రా రుణాలమాఫీకి కట్టుబడి ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డబ్బులు కట్టినా, కట్టకపోయినా ప్రతి సంఘానికి న్యాయం చేస్తామన్నారు. రుణమాఫీపై మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడం మహిళా చైతన్యమే కారణమని చెప్పారు. విభజన ద్యారా వచ్చిన నష్టాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. బెల్ట్ షాపులు మూయించాలని బాబుకు మహిళలు విజ్ఞప్తి చేశారు. బెల్ట్ షాపులు ఇంకా ఉన్నాయా అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నాయని మహిళలనడంతో ఆయన కంగుతిన్నారు. ఎక్సైజ్‌శాఖ పనితీరు బాగాలేదని ఆగ్రహించారు. నూతన రాజధాని నిర్మాణానికి రూ.62 లక్షల చెక్కును ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు అందజేశారు.