బెల్ట్‌ షాపులు ఇంకా ఉన్నాయా? | chandrababu surprise on Belt shops | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపులు ఇంకా ఉన్నాయా?

Published Thu, Jul 17 2014 6:01 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

బెల్ట్‌ షాపులు ఇంకా ఉన్నాయా? - Sakshi

బెల్ట్‌ షాపులు ఇంకా ఉన్నాయా?

కోయలగూడెం: డ్వాక్రా రుణాలమాఫీకి కట్టుబడి ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డబ్బులు కట్టినా, కట్టకపోయినా ప్రతి సంఘానికి న్యాయం చేస్తామన్నారు. రుణమాఫీపై మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడం మహిళా చైతన్యమే కారణమని చెప్పారు. విభజన ద్యారా వచ్చిన నష్టాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు.

బెల్ట్‌ షాపులు మూయించాలని బాబుకు మహిళలు విజ్ఞప్తి చేశారు. బెల్ట్‌ షాపులు ఇంకా ఉన్నాయా అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నాయని మహిళలనడంతో ఆయన కంగుతిన్నారు. ఎక్సైజ్‌శాఖ పనితీరు బాగాలేదని ఆగ్రహించారు. నూతన రాజధాని నిర్మాణానికి రూ.62 లక్షల చెక్కును ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement