seshadri express
-
కావలిలో ఆగనున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: బెంగళూరు, కాకినాడ మధ్య నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కావలి రైల్వే స్టేషన్లో నిలిపేందుకు(హాల్ట్) రైల్వే శాఖ అంగీకరించింది. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇందు కోసం రైల్వే శాఖకు పలుమార్లు విన్నవించడంతో ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలింజన్
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం రాత్రి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై రైలింజన్ నిలిచిపోయింది. దీని కారణంగా తణుకులో విశాఖ ఎక్స్‌ప్రెస్, అత్తిలిలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. నిడదవోలు, తణుకు మీదుగా విజయవాడ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. -
శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగల భీభత్సం
నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగలు భీభత్సం సృష్టించారు. రైలు కాకినాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా బుధవారం ఈ సంఘటన జరిగింది. మనుబోలు వద్ద రైలు లోకి చొరబడిన దొంగలు చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్-2, 7, 8 బోగిల్లో ఉన్న ప్రయాణికులను బెదిరించి నగదును, బంగారాన్ని దోచుకెళ్లారు. ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.