Published
Sat, Sep 17 2016 1:45 AM
| Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
మహిళ మెడలో సరుడు చోరీ
కావలిఅర్బన్ : అద్దెకు ఇల్లు ఉందా అంటూ అడుగుతూ ఓ మహిళ మెడలోని 6 సవర్ల సరుడును తెంచుకెళ్లిన సంఘటన శుక్రవారం రాత్రి స్థానిక చింతంవారి వీధిలో జరిగింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. చింతంవారి వీధికి చెందిన మద్దిన సీతమ్మ బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్‌ఎన్‌గా ఉద్యోగం చేస్తుంది. ఆమె ఇంటికి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఇంట్లో ఉన్న ఆమెను పిలిచి అద్దెకు ఇల్లు కావాలని అడిగాడు. ఇంటి ముందు గేటు వద్దకు చేరుకున్న ఆమె ఇక్కడ ఇల్లు లేవని చెప్పింది. ఇంతలో అతను ఫోన్‌లో మాట్లాడుతూ తన వద్ద ఉన్న ఓ స్లిప్‌ను చూపించి ఈ అడ్రస్ చూడమని ఆమెతో చెప్పాడు. ఆ కాగితం తీసుకుని చూస్తుండగానే ఒక్కసారిగా ఆమె మెడలోని సరుడును లాక్కుని వెళ్లాడు. హఠా™Œ lపరిణామం నుంచి తెరుకుని కేకలు వేసే సరికి చుట్టుపక్కల వాళ్లు చేరుకున్నారు. ఇంతలోనే దుండగుడు బైక్‌పై ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె నివాసానికి చేరుకుని విచారించారు. చామనఛాయ రంగులో బొద్దుగా ఉంటాడని ఆమె ఆనవాళ్లు తెలిపింది. బంగారం విలువ సుమారు రూ.1.25 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.