ప్రొఫెసర్లను నియమించాలి
కావలి: స్థానిక వీఎస్‌యా పీజీ సెంటర్‌లో ప్రొఫెసర్లను నియమించాలంటూ బుధవారం విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరగతులు ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు ప్రొఫెసర్లను నియమించలేదన్నారు. తమకు పాఠాలు ఎవరు చెప్తారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. సెంటర్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతోపాటు ఎంబీఏ, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్సులకు గెస్ట్ ఫ్యాకల్టీలు లేరని తెలిపారు. సుమారు రెండు గంటల చేపు సెంటర్ ఎదుట నిరసన తెలిపారు.
స్పందించిన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి:
విద్యార్థుల సమస్యపై స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అమెరికాలో ఉన్న ఆయన విషయం తెలుసుకున్నారు. యూనివర్సీటీ వీసీతో మాట్లాడి సమస్య పరష్కరించేందుకు కషిచేస్తానని విద్యార్థులకు తెలిపారు.