నినాదాల హోరు..
నినాదాల హోరు..
Published Mon, Feb 13 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
జేఎన్‌టీయూకే ప్రాంగణం
ఆర్–13 రెగ్యులైజేషన్‌లో రెండు సబ్జెక్టుల సడలింపు కోసం ధర్నా
బాలాజీచెరువు(కాకినాడ) : జేఎన్‌టీయూకేకు అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష విధానంలో తీసుకొస్తున్న మార్పులను రద్దు చేయాలంటూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గతంలో నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా రెండు సబ్జెక్టులు వదులుకునే వెసులుబాటు ఉండేదని, ప్రస్తుతం ఆ విధానం రద్దు చేశారని, ఈ విధానం కొత్త సంవత్సర విద్యార్థులకు విధించినా 2013లో చేరిన విద్యార్థులకు వర్తింపు లేకుండా నిబంధన సడలించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరీక్షల విధానంలో జంబ్లింగ్ విధానాన్ని 50 నుంచి 60కిలోమీటర్లు పెంచడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. వివిధ కళాశాలల నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు ఒక్కసారిగా వర్సిటీ భవనం ఎదుట అందోళనకు దిగి లోపలకు ప్రవేశించడానికి ప్రయత్నించడంతో వారిని అడ్డుకోవడం సెక్యూరిటీ వల్ల సాధ్యం కాకపోవడంతో సర్పవరం పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు రిజిస్ట్రార్ సాయిబాబు, రెక్టార్ ప్రభాకరరావులను కలిసి ఈ సమస్యలపై చర్చించారు. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల నుంచి వినతిప్రతం తీసుకున్న రిజిస్ట్రార్, రెక్టార్లు ఈవిషయాన్ని వీసి దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement