గోదావరి పుష్కరాల భక్తులతో తిరిగి వెళుతున్న ఓ ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది.
కావలి (నెల్లూరు): గోదావరి పుష్కరాల భక్తులతో తిరిగి వెళుతున్న ఓ ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరుపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఇన్నోవాలో 8 మంది ఉండగా, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరంతా రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళ్లి చెన్నై తిరిగి వెళుతున్నట్టు సమాచారం. విద్యుత్ స్తంభం విరిగిపడటంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.