రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
కావలిరూరల్ : రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మక్కెనవారిపాళెంకు చెందిన పల్లపు రవికుమార్ (27) బేల్దారి పనులు చేస్తుంటాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపం చెంది, శుక్రవారం మధ్యాహ్నం కావలికి వచ్చాడు. ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో రైలు పట్టాల మీద తల పెట్టడంతో తల మొండెం వేరు పడ్డాయి. రైల్వే కీమెన్ గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారమందించారు. హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు.