
ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
కావలి : నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో భారతి అనే విద్యార్థిని శుక్రవారం అర్థరాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్యాయత్నం చేసింది. తలకు వేసుకునే రంగును సేవించి ఆమె ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కాలేజీ యాజమాన్యం ఆమెను నెల్లూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భారతి మృతి చెందింది. మృతురాలి స్వస్థలం ఉదయగిరి మండలం కొండారెడ్డిపాలెం. కాగా భారతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.