ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ జేబీ కైవశం | JB college overall champion | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ జేబీ కైవశం

Published Fri, Nov 11 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ జేబీ కైవశం

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ జేబీ కైవశం

 
కావలిఅర్బన్‌ : పట్టణంలోని జవహర్‌ భారతి కళాశాల ప్రాంగణంలో నాలుగురోజులుగా సాగుతున్న జిల్లా జూనియర్‌ కళాశాలల ఆటల పోటీల్లో కావలి జవహర్‌ భారతి జూనియర్‌ కళాశాల క్రీడాకారులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకున్నారు. గురువారం పోటీలు హోరాహారీగా సాగాయి. క్రీడాకారులు ఉత్కంఠభరితంగా ఆటల్లో తలపడ్డారు.  ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్‌ దొడ్ల వినయకుమార్‌రెడ్డి, దొడ్ల లక్ష్మీరెడ్డి, ప్రిన్సిపల్‌ పోతురాజు, పీడీలు డాక్టర్‌ మాల్యాద్రి, ప్రసాద్‌రెడ్డి, ఆయా కళాశాలల పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. 
  • బాలుర విభాగం షటిల్‌ బ్యాట్మింటన్‌లో వెంకటగిరి ఏపీడబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాల విన్నర్స్‌గా, నెల్లూరు కేఏసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రన్నర్‌గా నిలిచాయి.
  • బాల్‌ బ్యాట్మింటన్‌లో కావలి సాయి కో-ఆపరేటివ్‌ కళాశాల విన్నర్‌గా, కావలి చైతన్య జూనియర్‌ కళాశాల రన్నర్‌గా నిలిచాయి.
  • హ్యాండ్‌బాల్‌లో కోట ఏపీడబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాల, కావలి పీహెచ్‌ఆర్‌ జేబీ జూనియర్‌ కళాశాల విన్నర్స్‌గా నిలిచాయి. కొండాపురం ఏపీ మోడల్‌ స్కూలు రన్నర్‌గా నిలిచింది. 
  • బాస్కెట్‌బాల్‌లో కావలి పీహెచ్‌ఆర్‌ జేబీ జూనియర్‌ కళాశాల విన్నర్‌గా, కావలి శ్రీసాయి కళాశాల రన్నర్‌గా నిలిచింది. 
  • ఫుట్‌బాల్‌లో బిట్రగుంట జీజేసీ విన్నర్‌కాగా, కావలి పీహెచ్‌ఆర్‌ జేబీ కళాశాల రన్నర్‌గా నిలిచింది. 
  • వాలీబాల్‌లో కావలి జేబీ జూనియర్‌ కళాశాల విన్నర్స్‌ కాగా బిట్రగుంట జీజేసీ రన్నర్స్‌గా నిలిచింది. 
  • కబడ్డీలో ఇనమడుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విన్నర్స్‌గా, కావలి శ్రీసాయి జూనియర్‌ కళాశాల రన్నర్స్‌గా నిలిచింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement