సాక్షి, తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ రూ. 20,000 కోట్ల విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అయితే ఇందుకోసం ఇవాళ కావలిలో పర్యటించిన ఆయన.. ఆ పర్యటనపై ట్వీట్ చేశారు.
దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపేలా నేడు రాష్ట్రంలోని 2,06,171 ఎకరాల చుక్కల భూములపై 97,471 మంది రైతన్నలకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన ప్రభుత్వంలో వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం అని సభలో ప్రసంగించిన వీడియోను పోస్ట్ చేశారాయన.
దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపేలా నేడు రాష్ట్రంలోని 2,06,171 ఎకరాల చుక్కల భూములపై 97,471 మంది రైతన్నలకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2023
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన ప్రభుత్వంలో వారికి అన్ని విధాలా అండగా… pic.twitter.com/qZfUgBDoqM
Comments
Please login to add a commentAdd a comment