
కావలి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన సీహెచ్ జనార్దనరెడ్డి (42) నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించిన ఉదంతంపై ఈనాడు వక్రభాష్యం ఇస్తూ దుష్ప్రచారం చేయడంపై మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఈ ఘటనకు కారణమైతే ఈనాడు పత్రిక మాత్రం ప్రభుత్వం నుంచి బిల్లులు రాక అతను ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచురించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనార్దనరెడ్డి గ్రామంలో సచివాలయన్ని నిర్మించాడు. దాని తాలూకా రూ.27 లక్షలు అతనికి ప్రభుత్వం చెల్లించేసింది.
ఇంకా రూ.6 లక్షలు మాత్రమే బకాయి ఉంది. అయితే, అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. భార్య దూరమైంది. పైగా అతనికి ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో.. తండ్రితోపాటు ఉంటున్న జనార్దనరెడ్డి ఈనెల 16వ తేదీన మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో మేడపై ఉన్న తన గదిలోకి వెళ్లి పురుగుమందు తాగి బయటకు వెళ్లాడు.
అతను పురుగుమందు తాగినట్లు గ్రామస్తులు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు హుటాహుటిన కావలిలోని ఒక ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండి ఇంటికొచ్చిన జనార్థనరెడ్డికి చాలా ఏళ్లుగా ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. దీంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ జనార్దనరెడ్డి శనివారం మరణించాడు. వాస్తవం ఇలాగుంటే.. ‘ఈనాడు’ మాత్రం సచివాలయం
Comments
Please login to add a commentAdd a comment