
సాక్షి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సాయం కోసం చూసే ఎదురు చూపులు ఎక్కడున్నా జననేతను కదిలిస్తాయి. అంత గజిబిజి షెడ్యూల్‌లోనూ వాళ్ల కోసం సమయం కేటాయించి.. అక్కడికక్కడే వాళ్ల సమస్యలను పరిష్కరించడం నిజంగా ఆయన గొప్పతనం. అక్కడితోనే ఆగకుండా దీర్ఘకాలికంగానూ సాయం అందేలా చూడడంలో జగనన్న ప్రభుత్వం వెనుకంజ వేయదు. తాజాగా.. కావలి పర్యటనలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ సమస్యలతో వచ్చిన కొందరిని అక్కున చేర్చుకున్నారు.
తనను కలిసి సమస్యలను వివరించేందుకు వచ్చిన దివ్యాంగులను ప్రత్యేకంగా హెలిపాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకున్నారాయన. సావధానంగా వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆపై అందరికీ తక్షణసాయంగా లక్ష రూపాయలు అందించి, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు కూడా.
👉 ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మెదరమెట్లపాలెం గ్రామానికి చెందిన మర్రిపూడి సుబ్బారావు.. రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతిని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. తన ఆపరేషన్ కోసం సీఎం జగన్‌కు విన్నవించుకోగా, సాయంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
👉 కలిగిరి మండలానికి చెందిన బత్తిన షణ్ముఖ కుమార్ జన్యుపరమైన సమస్యతో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు అందించారు.
👉 ఇక ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామ సర్పంచ్ అయిన దుగ్గిరాల రాఘవ.. సీఎం జగన్‌ను కలిసేందుకు కావలికి భార్యాబిడ్డలతో పాటు వచ్చాడు. రాఘవ రెండు కిడ్నీలు చెడిపోయాయి. వాటి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అందుకే ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు. వెంటనే సీఎం జగన్ లక్ష రూపాయల సాయం అందించారు.
👉 సర్వేపల్లికి చెందిన నోసం అమూల్య అరుదైన వైద్యంతో బాధపడుతోంది. రాయవేలూరులో చికిత్స అందుతోంది. అయితే నాలుగు సంవత్సరాలుగా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతోందట. ఈ విషయం దృష్టికి రావడంతో.. అమూల్యను జగన్ ఓదర్చారు. తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించారు సీఎం జగన్.
👉 అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వేల్పుచర్ల వారి పల్లి గ్రామానికి చెందిన పిడతల నాగరాజు ఒక కాలు, ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి ఎటువంటి పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. సీఎం జగన్‌ను కలిసి తన గోడును వెల్లబోసుకునేందుకు కావలి వచ్చాడు. నాగరాజు దీనావస్థను అర్థం చేసుకుని లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
👉 కావలి చెంచుగారిపాలెంలో ఉండే పోసిన వెంకట్రావు షుగర్ పేషెంట్. అయితే మందులకు ప్రతినెల ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంత భారం భరించలేని స్థితిలో ఉన్నట్లు సీఎం జగన్ దృష్టికి తన ఇబ్బంది తీసుకెళ్లాడాయన. వెంటనే స్పందించిన సీఎం జగన్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు.
👉 పొదలకూరు మండలం ఊట్లపాలెం గ్రామానికి చెందిన చెందిన వెంకట అఖిల్ వెన్నెముక ఆపరేషన్ కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మరింత మెరుగైన ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారట. అయితే అంత ఆర్థిక స్తోమత తన దగ్గర లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోరడానికి కావలి వచ్చాడు. అతని పరిస్థితి తెలిసి.. తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్.
ఈ ఏడుగురికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఆర్డీవో సీనా నాయక్ సమక్షంలో తక్షణ సాయంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రత్యేకంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకుని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే!
Comments
Please login to add a commentAdd a comment