Published
Sat, Oct 29 2016 1:42 AM
| Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
మెకానిక్ షాపులో చోరీ
రూ.లక్ష నగదు అపహరణ
కావలిరూరల్ : మెకానిక్ షాపులో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణంలోని బృందావనం కాలనీ ఎదురుగా ఉన్న ఎస్2 కేఎండబ్ల్యూ బైక్ మెకానికల్ అండ్ స్పేర్ పార్ట్స్ షాపునకు గురువారం రాత్రి యజమాని బాలకృష్ణ తాళంవేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం వచ్చి తాళాలు తీసి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. షాపు వెనుక గోడకు ఉన్న వెంటిలేటర్ పగలగొట్టి ఉంది. టేబుల్ డ్రా లాక్ తీసి ఉంది. టేబుల్‌లో స్పేర్‌పార్ట్స్ కోసం ఉంచిన రూ.లక్ష నగదును దుండగులు అపహరించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో షాపులో పని చేసి వెళ్లిన ఇద్దరు యువకులపై బాలకృష్ణ అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.