రైలు ఢీకొని వీఆర్‌ఏ మృతి
కావలిఅర్బన్ : స్థానిక ముసునూరు రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వీఆర్‌ఏ చిట్టేటి సుబ్బయ్య (60) దుర్మరణం చెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు... ముసునూరుకు చెందిన వీఆర్‌ఏ సుబ్బయ్య విధి నిర్వహణలో భాగంగా గ్రామ శివారు ప్రాంతానికి Ðð ళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.