శిక్ష పడేలా చూడాలి | punish them | Sakshi
Sakshi News home page

శిక్ష పడేలా చూడాలి

Published Thu, Jul 28 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

punish them

 
 
కావలిరూరల్‌ : సమాజంలో మహిళలపై వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, వాటిని నిరోధించాలంటే నేరుస్తులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని ధరణి ప్రజా మహిళా సామాజిక సంస్థ అధ్యక్షురాలు చాకలికొండ శారద అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు పడారుపల్లిలో సుమలతను చంపిన ఆమె భర్త శ్రీకాంత్‌ను, విజయనగరం జిల్లా ఎస్‌ కోట మండలం, గాజులరేగకు చెందిన గౌతమిని చంపిన ప్రేమోన్మాది విక్రమ్‌లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతసాగరంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సిబ్బందిని లైంగికంగా వేదిస్తున్న వైద్యాధికారి కరుణాకర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కామాక్షి, ఉపాధ్యక్షురాలు నాయుడు అంజమ్మ, ట్రెజరర్‌ కె.రమాదేవి, సభ్యురాలు ఎన్‌.తురుమల పాల్గొన్నారు.
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement