Idiots
-
బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్
తన విధానాలను సోషలిజంగా పేర్కొంటూ ఇడియట్స్గా ముద్రవేస్తున్నారంటూ మండిపడ్డారు అమెరికా అధ్యక్షడు జో బైడెన్. ఈ మేరకు ఆయన ఇల్లినాయిస్లోని జోలియెట్లో ఒక ప్రాథమిక పాఠశాలలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న సామజిక సేవలను విమర్శిస్తూ సోషలిజంగా పేర్కొంటున్నారని అన్నారు. రిపబ్లికన్లు ప్రజలకు సామాజిక భద్రత కల్పించే సేవ కార్యక్రమాలను హరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన సోషలిజాన్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షుడిగా వచ్చినప్పుడే సోషలిజం సంకేతాలు వినిపించాయి అందుకే దాన్ని ప్రేమించాను అందులోకి వచ్చానని దృఢంగా చెప్పారు. ఐనా రిపబ్లికన్లు సామాజిక భద్రత, వైద్య సంరక్షణ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాశనం చేయాలని చూశారంటూ బైడెన్ మాటాల తుటాలు పేల్చారు. కష్టపడి పనిచేయండి, సహకరిచండి అప్పుడు మీకు ఈ విషయాలు సులభంగా అర్థమవుతాయంటూ గట్టి కౌంటరిచ్చారు. ఇవి నిబద్ధతతో కూడిన హామిలు, దీన్ని అమెరికన్ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టే బాగా పనిచేస్తుంన్నారు. రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ...దయచేసి కాస్త బ్రేక్ ఇవ్వండి కచ్చితంగా ఎవరు ఇడియట్స్ అనేది తేలిపోదుంగి అని వ్యగ్యంగా అన్నారు. బైడెన్ వ్యాఖ్యలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా నవ్వులు, చప్పట్లతో మారు మ్రోగిపోయింది. (చదవండి: జెలెన్స్కీ తరుపై అసహనం...అత్యాశకు పోతే అంతే!) -
శిక్ష పడేలా చూడాలి
కావలిరూరల్ : సమాజంలో మహిళలపై వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, వాటిని నిరోధించాలంటే నేరుస్తులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని ధరణి ప్రజా మహిళా సామాజిక సంస్థ అధ్యక్షురాలు చాకలికొండ శారద అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు పడారుపల్లిలో సుమలతను చంపిన ఆమె భర్త శ్రీకాంత్‌ను, విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం, గాజులరేగకు చెందిన గౌతమిని చంపిన ప్రేమోన్మాది విక్రమ్‌లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతసాగరంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సిబ్బందిని లైంగికంగా వేదిస్తున్న వైద్యాధికారి కరుణాకర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కామాక్షి, ఉపాధ్యక్షురాలు నాయుడు అంజమ్మ, ట్రెజరర్ కె.రమాదేవి, సభ్యురాలు ఎన్.తురుమల పాల్గొన్నారు. -
చాలా పనికిమాలిన పనులు చేశాడు
-
'రాజికీయ నాయకులు ఇడియట్స్'
-
'రాజకీయ నాయకులు 'ఇడియెట్స్', ఐటీ నిపుణులు 'అసంతృప్తి మూక''
ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సీఎన్ఆర్ రావు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను 'అసంతృప్తి మూక' , రాజకీయ నేతలను 'ఇడియెట్స్' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'కేవలం డబ్బు కోసమే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పనిచేస్తారు. వాళ్లు ఒక అసంతృప్తికి గురైన గుంపు' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ నిపుణుడు, హత్య గురైన టెకీ, విడాకులు తీసుకున్న ఐటీ ప్రొఫెషనల్ అనే హెడ్డింగ్ లతో పేపర్లో రోజు వార్తలు చదువుతాను అని అన్నారు. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అసంతృప్తితో జీవితం గడుపుతున్నారు. వారి జీవితం చాలా దుర్భరంగా ఉంది అని వ్యాఖ్యానించారు. అంతేకాక వాళ్లు తమ పనిని ఎంజాయ్ చేయలేరని.. తాను 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత ఆనందంగా ఉన్నానో చూడండి అన్నారు. కేవలం క్రీడలకు, ఆర్మీ ఇతర అంశాలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని.. సైంటిస్టులకు ఈ దేశంలో గుర్తింపు లేదు అని అన్నారు. 2005లో నోబెల్ బహుమతికి సమానంగా ఉండే డాన్ డేవిడ్ పురస్కారం తనకు లభించిందని, దాని విలువ ఒక మిలియన్ డాలర్లు అని అన్నారు. తనకు లభించిన పురస్కారం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు అని అన్నారు. ఎప్పుడో ఒక్కసారి ఇచ్చే ఈ పురస్కారం ఇతర దేశాల్లో కూడా ఎవరికి లభించలేదని.. అలాంటిది తనకు లభిస్తే ఈ దేశంలో గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శాస్త్రీయ రంగానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని.. రాజకీయ నాయకులు ఇడియెట్స్ అని అన్నారు. శనివారం సీఎన్ఆర్ రావుకు సచిన్ తోపాటు భారత రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.