చాలా పనికిమాలిన పనులు చేశాడు | all boys are idiots, he did brutal acts, writes rishiteswari in her diary | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 4 2015 7:01 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రిషితేశ్వరి డైరీ.. ఆమె జీవితంలో ఇప్పటివరకు తెరుచుకోని చాలా పేజీలను వివరించింది. మొదటి నుంచి స్నేహితుడని, మంచివాడని అనుకున్నవాళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించారో చెప్పింది. మూడు పేజీలలోనే తాను అనుభవించిన నరకం అంతటినీ ఈ లోకం ముందుంచింది. మొదటి పేజీ తను ఇవాళ చాలా బ్యాడ్‌ ఫీలయ్యానని, నిజానికి క్లాస్‌లోకి ఎంటరైనప్పుడు తనకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని తన డైరీ మొదటి పేజీలో రిషితేశ్వరి రాసుకుంది. తనకు చాలా భయమేస్తోందని, క్లాస్‌లో ఉన్న మగపిల్లలంతా ఇడియట్స్‌ అని, ఐ హేట్‌ ఎవ్రీ వన్‌ అంటూ రాసుకుంది. తాను వాట్సాప్‌లో అతనితో చాటింగ్‌ చేశానని, సడన్‌గా ఐ లవ్‌ యూ చెప్పాడని, దాంతో తాను షాక్‌ తిన్నానని రిషితేశ్వరి డైరీలో రాసుకుంది. అతనే తనకు మొదటి స్నేహితుడని, తనను హర్ట్‌ చేసిన మొదటి వాడు కూడా అతననేని రాసుకుంది. అతను చాలా పనికిమాలిన పనులు చేశాడని, వేర్వేరు నెంబర్ల నుంచి తనకు ఎస్ఎంఎస్లు పంపించేవాడని రిషితేశ్వరి డైరీ మొదటి పేజీలో రాసుకుంది. రెండో పేజీ తన స్నేహితురాలైన అనీషా గురించి రిషితేశ్వరి రెండో పేజీలో ఎక్కువగా ప్రస్తావించింది. ఆమె తనకంటే సీనియర్‌ అని, నాలుగో సంవత్సరం చదువుతోందని రాసుకుంది. తనతో బాగానే ఉండేదని, అయితే ఆమె చాలా చెడ్డదని రిషితేశ్వరి అభిప్రాయపడింది. శ్రీనివాస్‌ పట్ల తన అటెన్షన్‌ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిందని, చాలా బాధగా ఉంది, జీర్ణించుకోలేక పోతున్నానంటూ వాపోయింది. ఇక తాను ఎవ్వరినీ నమ్మకూడదని గట్టిగా అనుకున్నానని రిషితేశ్వరి డైరీ రెండో పేజీలో రాసుకుంది. మూడో పేజీ తనకెంతో ఆప్తమిత్రుడనుకున్న వాడే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బాడ్‌గా బిహేవ్‌గా చేశాడని డైరీ మూడో పేజీలో రిషితేశ్వరి రాసుకుంది. తన జీవితంలో ఇది అత్యంత దుర్దినమని, తన జీవితం వృధా అని, తన వల్ల ఎవరికీ ఉపయోగం లేదని బాధపడిపోయింది. ఐలవ్‌ యూ డాడీ, దయచేసి తనను అర్థం చేసుకోవాలంటూ అభ్యర్థించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement