punish
-
ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!
ఇబ్రహీంపట్నం రూరల్: సంచలనం రేపిన రియల్టర్ల జంట హత్యల కేసులో కొంతమంది పోలీసులపై వేటు తప్పదని తెలుస్తోంది. రెండు నెలలుగా లేక్‌విల్లాలోని భూ తగాదాల్లో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మట్టారెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ తగాదాల్లో అనేకమార్లు మాట్లాడినప్పటికీ సయోధ్య కుదరలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఇద్దరూ మట్టారెడ్డిని బెదిరించినట్లు సమాచారం. అదేరోజు తనకు ప్రాణహాని ఉందని వారిద్దరిపై మట్టారెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని తెలిసింది. ఉన్నత స్థాయి అధికారి నోటీసుకు ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదని.. దీంతో భయాందోళనకు గురైన మట్టారెడ్డి.. ఎలాగైనా వారిద్దరి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ఇలా హత్యకు కుట్ర చేసినట్లు సమాచారం. భారీగా ముడుపులు..! పోలీసులకు శ్రీనివాస్‌రెడ్డి నుంచి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఓ పెద్ద స్థాయి పోలీసు అధికారి లేక్‌విల్లాను పరిశీలించి వెళ్లారని సమాచారం. కేసును కనీసం పట్టించుకోలేదని మట్టారెడ్డి ఆరోపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీసు కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై వేటు వేయాలని రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఫిర్యాదు చేసినా స్పందన లేకే.. రెండు నెలలుగా కర్ణంగూడలో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని లేక్‌విల్లా ఆర్చిడ్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కౌన్సిలర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. మట్టారెడ్డి కేసుపై ఎటూ తేల్చలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తన ప్రాణాలు కాపాడుకోవడానికి హత్య చేసినట్లు మట్టారెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. మట్టారెడ్డి ఫిర్యాదు చేసినప్పుడే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే హత్యల దాకా వచ్చేది కాదని చర్చించుకుంటున్నారు. ఐదుగురు నిందితులకు రిమాండ్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మేరెడ్డి మట్టారెడ్డి, ఖాజా మోహియుద్దీన్, బుర్రి భిక్షపతి, సయ్యద్ రహీం, సమీర్ అలీని సాయంత్రం ఇబ్రహీంపట్నం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. (చదవండి: కటకటాల్లో గజదొంగ నాయక్) -
కొత్త చట్టం.. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదు!
బీజింగ్: పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మొదటగా వాళ్ల తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదన్న మాటే వినిపిస్తుంది. ఎందుకgటే పిల్లల మనస్తత్వం ఎలా ఉన్నా అంతెందుకు వాళ్లు చెడు మార్గంలో పయనించిన, లేదా ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ క్రెడిట్ మొత్తం తల్లిదండ్రులకే దుక్కతుంది. ఇది సర్వ సాధారణం. అయితే ఇవి ఇప్పటివరకు మాటల వరకే పరిమితంగా ఉండేవి కానీ వీటినే చట్టంగా మార్చి శిక్ష కూడా వేస్తామంటోంది చైనా ప్రభుత్వం. చైనా తీసుకువస్తున్న ఈ చట్ట ప్రకారం.. పిల్లలు తప్పు చేస్తే.. ఇక నుంచి వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారట. అందుకోసం చైనాలో సరికొత్త చట్టం రూపొందుతోంది. ఆ చట్టం ప్రకారం.. పిల్లల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకున్నా, వాళ్లలో చెడు ప్రవర్తన ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను అందించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బిల్లును చైనా ప్రభుత్వం రివ్యూ కూడా చేస్తోంది. ఈ చట్టం ఏం చెప్తోందంటే.. తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కాసేపు సమయం కేటాయించాలి. సమాజం గురించి చెప్పాలి. సామాజిక బాధ్యత గురించి తెలియజేయడంతో పాటు ఆచరించేలా ప్రోత్సాహించాలి. చట్టాల మీద అవగాహన కూడా తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ రకంగా పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలిని ఆ బిల్లులో పేర్కొంది. ఆ దేశ పిల్లలు ఇటీవల ఆన్లైన్ గేమింగ్ వ్యసనంగా మారడంతో గత కొన్ని నెలలుగా, చైనా విద్యా మంత్రిత్వశాఖ మైనర్లకు పరిమిత గేమింగ్ గంటలను మాత్రమే వీలు కల్పించింది. దీని ప్రకారం శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్లైన్ గేమ్‌లు ఆడటానికి మాత్రమే వీలుంటుంది. చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి.. -
'బలి' మేక మాయం.. ఆగ్రహించిన ‘అమ్మ’ భక్తులు
ఒడిశా,బరంపురం: గంజాం జిల్లాలోని బెల్లిగుంటా సమితి పరిధిలో ఉన్న గుంటరిబడి గ్రామదేవత అమ్మవారికి బలి ఇచ్చేందుకు గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఓ మేకను కొనుగోలు చేశారు. దానిని గ్రామంలోని ఓ పశువుల శాలలో కట్టి ఉంచారు. అయితే ఇదే గ్రామానికి చెందిన సంతు తరణి, సిమ్మ బిశాయి అనే ఇద్దరు యువకులు మేకను ఎత్తుకుపోయి, ఓ మాంసం దుకాణానికి అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఆ ఇద్దరు యువకులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గ్రామంలోని ఓ స్తంభానికి కట్టి, చీవాట్లు పెట్టారు. ప్రస్తుతం ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుల దొంగతనంపై దర్యాప్తు చేపడుతున్నారు. -
స్మిత్ ఎందుకలా చేశాడు?
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ తనను తాను శిక్షించుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో విఫలమైనందుకు మూడు కిలోమీటర్లు పరుగెత్తి తనకు తాను శిక్ష వేసుకున్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత బస్సు మిస్సైన స్మిత్.. స్టేడియం నుంచి 3 కిలోమీటర్లు పరుగెత్తి హోటల్‌కు చేరుకున్నాడు. ‘పరుగులు చేయనప్పుడు నన్ను నేను శిక్షించుకుంటాను. సెంచరీ చేస్తే చాక్లెట్ తీసుకుని నన్ను నేను అభినందించుకుంటాను. మ్యాచ్‌లో ఎప్పుడు విఫలమైనా పరుగెత్తడం లేదా జిమ్‌కు వెళ్లడం చేస్తాను. నన్ను నేను శిక్షించుకోవడానికి ఏదోటి చేస్తుంటాన’ని స్మిత్ చెప్పాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ 4 పరుగులు మాత్రమే చేసి యాసిర్ షా బౌలింగ్‌లో అవుటయ్యాడు. డేవిడ్ వార్నర్(154), లబ్‌షేన్(185) సెంచరీలతో చెలరేగారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు 29 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది. ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అతడికి చేరువగా వచ్చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టులో స్మిత్ విఫలం కావడంతో ఇద్దరి మధ్య అంతరం 25 నుంచి 3 పాయింట్లకు తగ్గిపోయింది. (చదవండి: కోహ్లి వచ్చేస్తున్నాడు స్మిత్..) -
ఎమ్జీఎమ్ స్కూల్ నిర్వాకం
-
కామాంధుడిని కఠినంగా శిక్షించాలి
నెల్లూరు: గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు మాధవయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం, ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం నాయకుడు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ... నగరంలోని రిత్విక్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో విచారణ, చర్యలు సక్రమంగా లేవన్నారు. కేసును తప్పు దారి పట్టించేందుకు ధనబలం, అధికారబలం ప్రయోగించి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అత్యాచారినికి పాల్పడిన వ్యక్తిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. గిరిజన సంఘం నాయకులు ఇండ్ల రవి, ఆర్ఎల్. శేఖర్, కొండా ప్రసాధ్, శ్రీనివాసులు, ఐద్వా నాయకులు పి.విజయ, షాహినాబేగం, అరిగెల రమమ్మ, షంషాద్ పాల్గొన్నారు. -
గిరిజనులను రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా?
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులను రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా? అని ఆయా శాఖల అధికారులను హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. శనివారం మండలంలోని కేఆర్ పురం ఐటీడీఏ వద్ద గిరిజన ఎల్టీఆర్ పోడు భూములు, పునరావాస ప్యాకేజీ సమస్యలపై బహిరంగ విచారణ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు భూసమస్యలపై గోడును రిటైర్డ్ జడ్జి వద్ద మొరపెట్టుకున్నారు. 20 సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్నామని, ఆ భూములకు సంబంధించి తమకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో పాటు తమ పేర్లు 1(బి) లో కూడా ఉన్నాయంటూ వాటికి సంబంధించిన రికార్డులను ఆయనకు చూపించారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే తమ పేర్లు 1(బి)లో లేకుండా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారంటూ వాపోయారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ గిరిజనుల కష్టాలను వింటుంటే చెప్పలేని బాధ కలుగుతుందన్నారు. ఆదివాసీలైన గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన చట్టాలు ఇక్కడ అమలు కావడంలేదని స్పష్టమవుతుందన్నారు. గిరిజనులను కాపాడాల్సిన అధికారులే గిరిజనేతరులకు అండగా ఉంటూ వారి హక్కులను కాలరాస్తున్నట్టు తెలుస్తుందని చెప్పారు. చట్టాలను కాలరాసే ఏ అధికారైనా వారిపై కేసులు పెట్టవచ్చన్నారు. ఏ గిరిజన ప్రాంతంలో లేని సమస్యలు ఈ ప్రాంతంలోనే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు నీతి, నిజాయితీతో ఉంటే సమస్యలు ఏర్పడేవే కావన్నారు. వారిలా లంచాలకు ఎగబడి అక్రమాలకు పాల్పడడం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. ఇక్కడి గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. రెడ్డిగణపవరంలో కూడా గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కూడా గిరిజనులు తమ బాధలను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పల్లా త్రినా«థరావు, గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు ఏ.రవి, ఎ.ఫ్రాన్సిస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు కాకి మధు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చిన దోషులను శిక్షించాలి
వేములపల్లి : వరంగల్ జిల్లా పరకాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్యని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ పేద ప్రజలు, రైతులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో కషిచేశాడని అలాంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఆయన వెంట వేములపల్లి, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు పెద్దమామ్ సైదులు, పిల్లుట్ల బ్రహ్మం, నాయకులు మొండి సైదిరెడ్డి, బొబ్బిలి శ్రీను, పోరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శిక్ష పడేలా చూడాలి
కావలిరూరల్ : సమాజంలో మహిళలపై వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, వాటిని నిరోధించాలంటే నేరుస్తులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని ధరణి ప్రజా మహిళా సామాజిక సంస్థ అధ్యక్షురాలు చాకలికొండ శారద అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు పడారుపల్లిలో సుమలతను చంపిన ఆమె భర్త శ్రీకాంత్‌ను, విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం, గాజులరేగకు చెందిన గౌతమిని చంపిన ప్రేమోన్మాది విక్రమ్‌లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతసాగరంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సిబ్బందిని లైంగికంగా వేదిస్తున్న వైద్యాధికారి కరుణాకర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కామాక్షి, ఉపాధ్యక్షురాలు నాయుడు అంజమ్మ, ట్రెజరర్ కె.రమాదేవి, సభ్యురాలు ఎన్.తురుమల పాల్గొన్నారు. -
చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి
చేర్యాల : ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని కొమురవెల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ... మహారాష్ట్రలోని భువనపటాకు చెందిన పరమానంద్ అనే వ్యక్తి కొమురవెల్లిలోని బత్తిని నర్సింహులు అనే చిరు వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నర్సిం హులు కుటుంబసభ్యులు తాళం వేసి పొలానికి వెళ్లగా పరమానంద్ ఇంట్లోకి చొరబడి కిరాణా షాపులోని చిల్లర సరుకులు, గల్లాపెట్టెలోని నగదు తీసుకున్నాడు. ఈ విష యం గమనించిన పొరుగువారు నర్సింహులుకు సమాచారం అందించారు. నర్సింహులు ఇంటికి రాగానే అతడితో పాటు స్థానికులు పరమానంద్‌ను స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వద్ద ఎలాంటి ఐడీ అడ్రసులు లేవు, అత డు కూడా గంటకో పేరు చెపుతూ, హిందీ లో మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులకు సైతం అర్థం కాలేదు. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చిన్నారికి వాతలు పెట్టిన ఆయా
-
సల్మాన్ ట్వీట్లపై విమర్శలు
న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా జాతి వ్యతిరేక చర్యలను సమర్థిస్తే వారిని తప్పకుండా శిక్షించాలని సల్మాన్‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. మానవత్వం పేరిట జాతికి వ్యతిరేకంగా ప్రవర్తించినా అది తప్పే అవుతుందని అన్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే సరైన సమయం ఇదే అని రాందేవ్ తెలిపారు. ఇంకా ఎవరేమన్నారంటే... * రేపు నేను ఈ విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళతాను. లోక్‌సభలో సల్మాన్ ట్వీట్ల అంశాన్ని లేవనెత్తుతాను. ...కిరిత్ సోమయా, బీజేపీ ఎంపీ * ఇలాంటి అంశాలకు మనం విలువ ఇవ్వొద్దు. ఇదే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. సల్మాన్ ఏమన్నా కోర్టు తీర్పును ప్రశ్నించాడా? ...ఉద్దవ్ ఠాక్రే, శివసేన చీఫ్ * మేం ఉరి శిక్షను వ్యతిరేకించాం. దోషి తప్పకుండా శిక్షించబడాలి. కానీ అదే సమయంలో ఉరిశిక్షను కాస్త తగ్గించాలి. డీ రాజా, సీపీఐ నేత యాకూబ్‌ను ఉరితీయొద్దని.. అతడి సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరితీయాలని సల్మాన్ పలు వ్యాఖ్యలతో ట్వీట్ చేయడంతో దానిపై ఈ ధుమారం రేగింది. -
'సూత్రదారులను శిక్షించాలి'