ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని కొమురవెల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి
Published Mon, Jul 25 2016 11:54 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
చేర్యాల : ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని కొమురవెల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ... మహారాష్ట్రలోని భువనపటాకు చెందిన పరమానంద్ అనే వ్యక్తి కొమురవెల్లిలోని బత్తిని నర్సింహులు అనే చిరు వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నర్సిం హులు కుటుంబసభ్యులు తాళం వేసి పొలానికి వెళ్లగా పరమానంద్ ఇంట్లోకి చొరబడి కిరాణా షాపులోని చిల్లర సరుకులు, గల్లాపెట్టెలోని నగదు తీసుకున్నాడు. ఈ విష యం గమనించిన పొరుగువారు నర్సింహులుకు సమాచారం అందించారు. నర్సింహులు ఇంటికి రాగానే అతడితో పాటు స్థానికులు పరమానంద్‌ను స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వద్ద ఎలాంటి ఐడీ అడ్రసులు లేవు, అత డు కూడా గంటకో పేరు చెపుతూ, హిందీ లో మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులకు సైతం అర్థం కాలేదు. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement