
స్తంభానికి యువకులను కట్టి, బంధించిన దృశ్యం
ఒడిశా,బరంపురం: గంజాం జిల్లాలోని బెల్లిగుంటా సమితి పరిధిలో ఉన్న గుంటరిబడి గ్రామదేవత అమ్మవారికి బలి ఇచ్చేందుకు గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఓ మేకను కొనుగోలు చేశారు. దానిని గ్రామంలోని ఓ పశువుల శాలలో కట్టి ఉంచారు. అయితే ఇదే గ్రామానికి చెందిన సంతు తరణి, సిమ్మ బిశాయి అనే ఇద్దరు యువకులు మేకను ఎత్తుకుపోయి, ఓ మాంసం దుకాణానికి అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఆ ఇద్దరు యువకులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గ్రామంలోని ఓ స్తంభానికి కట్టి, చీవాట్లు పెట్టారు. ప్రస్తుతం ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుల దొంగతనంపై దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment