కామాంధుడిని కఠినంగా శిక్షించాలి | punished the harsh person | Sakshi
Sakshi News home page

కామాంధుడిని కఠినంగా శిక్షించాలి

Published Tue, Mar 21 2017 11:29 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

punished the harsh person

నెల్లూరు: గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు మాధవయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం, ఐద్వా నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం నాయకుడు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ... నగరంలోని రిత్విక్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో విచారణ, చర్యలు సక్రమంగా లేవన్నారు. కేసును తప్పు దారి పట్టించేందుకు ధనబలం, అధికారబలం ప్రయోగించి తప్పించుకునే ప్రయత్నాలు 
చేస్తున్నారని ఆరోపించారు.

అత్యాచారినికి పాల్పడిన వ్యక్తిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేసీ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. గిరిజన సంఘం నాయకులు ఇండ్ల రవి, ఆర్‌ఎల్‌. శేఖర్, కొండా ప్రసాధ్, శ్రీనివాసులు, ఐద్వా నాయకులు పి.విజయ, షాహినాబేగం, అరిగెల రమమ్మ, షంషాద్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement