సల్మాన్ ట్వీట్లపై విమర్శలు | Punish Those Who Support Anti-National Activities: Ramdev on Salman Khan's Memon Tweets | Sakshi
Sakshi News home page

సల్మాన్ ట్వీట్లపై విమర్శలు

Published Sun, Jul 26 2015 4:27 PM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

సల్మాన్ ట్వీట్లపై విమర్శలు - Sakshi

సల్మాన్ ట్వీట్లపై విమర్శలు

న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా జాతి వ్యతిరేక చర్యలను సమర్థిస్తే వారిని తప్పకుండా శిక్షించాలని సల్మాన్ను ఉద్దేశిస్తూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. మానవత్వం పేరిట జాతికి వ్యతిరేకంగా ప్రవర్తించినా అది తప్పే అవుతుందని అన్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే సరైన సమయం ఇదే అని రాందేవ్ తెలిపారు.
ఇంకా ఎవరేమన్నారంటే...
  *  రేపు నేను ఈ విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళతాను. లోక్సభలో సల్మాన్ ట్వీట్ల అంశాన్ని లేవనెత్తుతాను.
...కిరిత్ సోమయా, బీజేపీ ఎంపీ
*  ఇలాంటి అంశాలకు మనం విలువ ఇవ్వొద్దు. ఇదే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. సల్మాన్ ఏమన్నా కోర్టు తీర్పును ప్రశ్నించాడా?
...ఉద్దవ్ ఠాక్రే, శివసేన చీఫ్

*  మేం ఉరి శిక్షను వ్యతిరేకించాం. దోషి తప్పకుండా శిక్షించబడాలి. కానీ అదే సమయంలో ఉరిశిక్షను కాస్త తగ్గించాలి.
డీ రాజా, సీపీఐ నేత

యాకూబ్ను ఉరితీయొద్దని.. అతడి సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరితీయాలని సల్మాన్ పలు వ్యాఖ్యలతో ట్వీట్ చేయడంతో దానిపై ఈ ధుమారం రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement