విద్యుదాఘాతంతో మహిళ మృతి
కావలిఅర్బన్ : డిష్ ప్లగ్ సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక చంద్రబాబునగర్ కాలనీలో గురువారం జరిగింది.
కావలిఅర్బన్ : డిష్ ప్లగ్ సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక చంద్రబాబునగర్ కాలనీలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన బాబు జలదంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య వరమ్మ(38) ఇంట్లో డిష్ సక్రమంగా పనిచేయకపోవడంతో వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన పక్కింటి మహిళ ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కూడా షాక్‌కు గురైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విద్యుత్‌ను నిలిపి వేసి 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఆమె మృతితో భర్త, కుమారులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.