విద్యుదాఘాతంతో యువకుడు మృతి
బిట్రగుంట : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కోళ్లదిన్నెలో బుధవారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు.. బోగోలు పాతదళితవాడకు చెందిన ఆలూరి మదన్ (19) తల్లి లక్ష్మి ఆరేళ్ల క్రితం, తండ్రి మల్లి నాలుగేళ్ల క్రితంమృతి చెందటంతో మదన్, చెల్లెలు మౌనిక కోళ్లదిన్నెలోని బంధువుల వద్ద ఉంటున్నారు. మౌనిక కళాశాలలో విద్యనభ్యసిస్తుండగా మదన్ చిన్నచిన్న ఎలక్ట్రికల్ పనులకు Ððవెళ్తున్నాడు. ఈ క్రమంలో మదన్ బుధవారం కోళ్లదిన్నెలో వైరింగ్ పనులు చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మదన్ సంరక్షణ బాధ్యతలు చూస్తున్న బంధువులు బిట్రగుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.