70 కిలోల గంజాయి స్వాధీనం | 70 kilos Cannabis seazed | Sakshi
Sakshi News home page

70 కిలోల గంజాయి స్వాధీనం

Published Mon, Apr 6 2015 12:00 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

70 kilos Cannabis seazed

రామచంద్రాపురం(మెదక్):హైదరాబాద్ నగరం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు ఆదివారం సాయంత్రం వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. రామచంద్రాపురం డీఎస్పీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షణలో రామచంద్రాపురం, పటాన్‌చెరు, బీడీఎల్, భానూర్, బొల్లారం పోలీసులు ఇక్రిశాట్ సమీపంలో వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నారు.

 

ఆ సమయంలో మహారాష్ట్రకు చెందిన ఖాలిద్ అనే వ్యక్తి కారులో 70 కిలోల గంజాయిని కారులో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ కారును ఆపి పరిశీలించగా గంజాయి బయటపడింది. దీంతో ఖాలిద్‌ను అదుపులోకి తీసుకొని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వాహనంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement