భువనేశ్వర్ : కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ప్రైవేటు హాస్పిటల్‌ని అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో ఇప్పటిరకు 27 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. మాంచెస్టర్‌లోని బ్లూ వీల్ హాస్పిటల్‌లో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనల్ని గాలికొదిలేశారు. కరోనా సోకిన బాధితుల్ని కూడా మిగతా సాధారణ రోగులతో కలిపి ఉంచారు. (కరోనాను అడ్డుకునే అత్యవసరాలు రైల్వే స్టేషన్‌లో లభ్యం )
సాధారణంగా అయితే వైరస్ సోకిన బాధుతుల్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తారు. అంతేకాకుండా పీపీఈ కిట్, ఎన్95 మాస్క్ సహా పలు జాగ్రత్తలు పాటించి వైద్యం అందించాల్సి ఉంటుంది. కానీ బ్లూవీల్ ఆస్పత్రి వైద్యాధికారులు మాత్రం ఈ నిబంధనల్ని గాలికొదిలేసి సాధారణ రోగులతో సహా వీరిని కూడా ఒకే వార్డులో ఉంచారు. ఆకస్మిక తనఖీలు చేపట్టిన అధికారులు సైతం యాజమాన్యం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణికి నివ్వెరపోయారు. మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించగా 27 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. (రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా )
Comments
Please login to add a commentAdd a comment