అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు పట్టివేత | gold and cash seazed | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు పట్టివేత

Apr 28 2015 12:17 AM | Updated on Sep 3 2017 12:59 AM

లెక్కలు చూపకుండా, ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాల టౌన్(కర్నూలు జిల్లా): లెక్కలు చూపకుండా, ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాల టౌన్‌లో జరిగింది. వివరాలు..పట్టణంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన ఒక స్విఫ్ట్ కారు అడ్డుకున్నారు. కారును తనిఖీ చేయగా రూ.2.50లక్షల నగదు, 20.3 తులాల బంగారు ఆభరణాలను లెక్కల్లో చూపకుండా తరలిస్తున్నపోలీసులు గుర్తించారు.

 

దీంతో కారును సీజ్ చేసి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బండి ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రాజేష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement