టాయిలెట్‌లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు | Gold Bars Worth Rs 2 Crore Recovered From Aircrafts Toilet At Delhi Airpot | Sakshi
Sakshi News home page

టాయిలెట్‌లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు

Published Sun, Mar 5 2023 2:28 PM | Last Updated on Sun, Mar 5 2023 2:28 PM

Gold Bars Worth Rs 2 Crore Recovered From Aircrafts Toilet At Delhi Airpot - Sakshi

సాక్షి, ఢిల్లీ: టాయిలెట్‌లో రెండు కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఇందీరాగాంధీ ఇంటర్నేషనల్‌(ఐజీఐ) విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. దేశీయ పర్యటనలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానg ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌ 2వద్ద ఆగినప్పుడూ ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు తెలిపారు.

ఈ మేరకు అధికారుల ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న విమానాన్ని తనిఖీ చేస్తుండగా.. వాషరూమ్‌లో సింక్‌కు దిగువున టేప్‌తో అతికించిన బూడిదరంగు పర్సును కనుగొన్నారు. దీంతో వెంటనే అధికారులు ఆ పర్సును స్వాధీనం చేసుకుని చూడగా..మొత్తం మూడు వేల గ్రాములకు బరువున్న నాలుగు దీర్ఘచతురస్రాకరా బంగారు కడ్డీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే బంగారు కడ్డీల ధర సుమారు 2 కోట్లు రూపాయాలపైనే ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

(చదవండి: 'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement