ట్రక్కును ఢీకొన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ | Jet Airways Aircraft Hits Truck At Delhis IGI Airport | Sakshi
Sakshi News home page

ట్రక్కును ఢీకొన్న జెట్‌ ఎయిర్‌వేస్‌

Published Mon, Apr 9 2018 8:41 AM | Last Updated on Mon, Apr 9 2018 12:27 PM

Jet Airways Aircraft Hits Truck At Delhis IGI Airport - Sakshi

ట్రక్కును ఢీకొన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని జెట్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.  దుబాయ్‌ నుంచి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం, ఎయిర్‌పోర్టులోని టర్మినల్‌ 3 వద్ద ల్యాండ్‌ అయింది. 

దానికి కేటాయించిన పార్కింగ్‌ ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తేజ్‌ శాట్స్‌ సర్వీసు ప్రొవైడర్‌ కేటరింగ్‌ వాహనం అక్కడే ఉండటంతో, ల్యాండ్‌ అవుతున్న ఆ విమానం రెక్కలు ట్రక్కును ఢీకొన్నాయి. అయితే ఈ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement