International flight
-
మరో అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు
-
టాయిలెట్లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు
సాక్షి, ఢిల్లీ: టాయిలెట్లో రెండు కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఇందీరాగాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐ) విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. దేశీయ పర్యటనలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానg ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2వద్ద ఆగినప్పుడూ ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారుల ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న విమానాన్ని తనిఖీ చేస్తుండగా.. వాషరూమ్లో సింక్‌కు దిగువున టేప్‌తో అతికించిన బూడిదరంగు పర్సును కనుగొన్నారు. దీంతో వెంటనే అధికారులు ఆ పర్సును స్వాధీనం చేసుకుని చూడగా..మొత్తం మూడు వేల గ్రాములకు బరువున్న నాలుగు దీర్ఘచతురస్రాకరా బంగారు కడ్డీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే బంగారు కడ్డీల ధర సుమారు 2 కోట్లు రూపాయాలపైనే ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: 'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి) -
విశాఖ వాసులకు శుభవార్త! ఇంటర్నేషనల్ ప్లైట్స్ ప్రారంభం ?
కరోనా సంక్షోభం కారణంగా దాదాపు 18 నెలలుగా వాయిదా పడిన అంతర్జతీయ విమాణ సర్వీసులు విశాఖపట్నం నుంచి తిరిగి మొదలుకాన్నాయి. అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కానుండటంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. 18 నెలలుగా కోవిడ్ కారణంగా 2020 మార్చి 23న దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి అన్ని రకాల విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఆ తర్వాత విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తెచ్చేందుకు ప్రారంభించిన వందేభారత్‌తో తిరిగి విమానాశ్రయం ప్రారంభమైంది. అటు తర్వాత దేశీ సర్వీసులు కూడా మొదలయ్యాయి. అయితే గడిచిన పద్దెనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభం కాలేదు. డిసెంబరు 29 నుంచి తాజాగా విశాఖ నుంచి ఇంటర్నేనల్ ప్రారంభించేందుకు సివిల్ ఏవియేషన్ శాఖ అన్ని అనుమతులు జారీ చేసింది. డిసెంబరు 15 నుంచి సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో ఒమిక్రాన్ వేరియంట్ భయాలు చుట్టుముట్టడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులను అంచనా వేసి డిసెంబరు 29 నుంచి ఇంటర్నేషనల్ విమానాలు ప్రారంభించాలని నిర్ణయించారు 4 గంటల 10 నిమిషాలు అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణలో భాగంగా తొలి విమానం డిసెంబరు 29న విశాఖపట్నం నుంచి సింగపూర్ బయల్దేరనుంది. స్కూట్ కంపెనీ తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి తేస్తోంది. వారానికి మూడు సార్లు ఈ సర్వీసు ఉంటుందని స్కూట్ తెలిపింది. విశాఖపట్నంలో రాత్రి 11 గంటలకు బయల్దేరి ఉదయం 5 గంటల 45 నిమిషాలకు సింగపూర్ చేరుతుంది. ప్రయాణ సమయం 4 గంటల 10 నిమిషాలుగా ఉంది. రెండే దేశాలవి వేర్వేరు టైమ్లైన్లు ఉన్నాయి. టిక్కెట్ చార్జీ ఒక్కరికి రూ. 8645గా ఉంది కోవిడ్ ఏర్పాట్లు విశాఖ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు బబుల్ నిబంధనలు వర్తిస్తాయి. విదేశాలకు చేరుకున్న ప్రయాణికులు ఆయా దేశాల్లో కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి వెళ్లే వారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధన వర్తింంప చేయడం లేదు. మరోవైపు విదేశాల నుంచి విశాఖకు వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎల్ఎల్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. చదవండి: రైల్వే ప్రయాణికుల కోసం, కేంద్రం కీలక నిర్ణయం -
హైదరాబాద్‌లో ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రం
అమెరికా, చైనా కేంద్రాల తర్వాత ఇది మూడోది - ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ - ఇండియా నుంచి 600 విమాన ఇంజిన్ల ఆర్డరు : ప్రాట్ అండ్ విట్నీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అంతర్జాతీయ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 7,000 విమాన ఇంజిన్లకు ఆర్డర్లు రాగా అందులో కేవలం 600 ఇండియా నుంచే వచ్చినట్లు ప్రాట్ అండ్ విట్నీ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ ఇంజిన్స్ -ఏషియా పసిఫిక్) మేరీ ఎల్లెన్ ఎస్ జోన్స్ తెలిపారు. మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం, ఇంధన ధరలు తగ్గడంతో దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ఇండిగో, గోఎయిర్, ఎయిర్కోస్టా వంటి దేశీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడమే దీనికి నిదర్శనమన్నారు. అంతకుముందు ప్రాట్ అండ్ విట్నీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వినియోగదారుల (ఇంజిన్లు ఉపయోగించే ఎయిర్‌లైన్స్ కంపెనీల సిబ్బంది) శిక్షణ కేంద్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అమెరికా, చైనా తర్వాత ఇది మూడవ కేంద్రమని, ఈ కేంద్రంలో జీటీఎఫ్, వీ2500 ఇంజిన్లపై వినియోగదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కేంద్రంలో 2,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వవచ్చని, దీన్ని త్వరలోనే 4,000 మందికి విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ సంస్థలో 1500 మంది పనిచేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిశీలన దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు దేశీయ విమానయాన రంగాన్ని ప్రోత్సహించే విధంగా కొత్త విమానయాన విధానం ఉంటుందని అశోక్ గజపతి రాజు తెలిపారు. ఇప్పటికే ఉన్న సంస్థలతో పాటు కొత్త సంస్థలను ప్రోత్సహించే విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. 5/20 నిబంధనను రద్దు చేయాలన్న ఆలోచనపై చెలరేగుతున్న వివాదంపై స్పందిస్తూ... పరిశ్రమ వృద్ధిని నియంత్రించే చర్యలను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తానన్నారు. ఐదేళ్లు దేశీయంగా విమానాలు నడిపి, కనీసం విమానాల సంఖ్య 20 వున్న సంస్థలకే విదేశీ సర్వీసులు నిర్వహించేందుకు అనుమతివ్వడానికి నిర్దేశించిన నిబంధనను 5/20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పౌర విమానయానరంగంలో వృద్ధి బాగానే ఉందని, సరుకు రవాణాలో కూడా వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం సమీపంలో నిర్మించతలపెట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు ఇంకా పరిశీలన దశలోనే ఉందని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.