కరోనా సంక్షోభం కారణంగా దాదాపు 18 నెలలుగా వాయిదా పడిన అంతర్జతీయ విమాణ సర్వీసులు విశాఖపట్నం నుంచి తిరిగి మొదలుకాన్నాయి. అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కానుండటంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
18 నెలలుగా
కోవిడ్ కారణంగా 2020 మార్చి 23న దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి అన్ని రకాల విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఆ తర్వాత విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తెచ్చేందుకు ప్రారంభించిన వందేభారత్‌తో తిరిగి విమానాశ్రయం ప్రారంభమైంది. అటు తర్వాత దేశీ సర్వీసులు కూడా మొదలయ్యాయి. అయితే గడిచిన పద్దెనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభం కాలేదు.
డిసెంబరు 29 నుంచి
తాజాగా విశాఖ నుంచి ఇంటర్నేనల్ ప్రారంభించేందుకు సివిల్ ఏవియేషన్ శాఖ అన్ని అనుమతులు జారీ చేసింది. డిసెంబరు 15 నుంచి సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో ఒమిక్రాన్ వేరియంట్ భయాలు చుట్టుముట్టడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులను అంచనా వేసి డిసెంబరు 29 నుంచి ఇంటర్నేషనల్ విమానాలు ప్రారంభించాలని నిర్ణయించారు
4 గంటల 10 నిమిషాలు
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణలో భాగంగా తొలి విమానం డిసెంబరు 29న విశాఖపట్నం నుంచి సింగపూర్ బయల్దేరనుంది. స్కూట్ కంపెనీ తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి తేస్తోంది. వారానికి మూడు సార్లు ఈ సర్వీసు ఉంటుందని స్కూట్ తెలిపింది. విశాఖపట్నంలో రాత్రి 11 గంటలకు బయల్దేరి ఉదయం 5 గంటల 45 నిమిషాలకు సింగపూర్ చేరుతుంది. ప్రయాణ సమయం 4 గంటల 10 నిమిషాలుగా ఉంది. రెండే దేశాలవి వేర్వేరు టైమ్‌లైన్లు ఉన్నాయి. టిక్కెట్ చార్జీ ఒక్కరికి రూ. 8645గా ఉంది
కోవిడ్ ఏర్పాట్లు
విశాఖ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు బబుల్ నిబంధనలు వర్తిస్తాయి. విదేశాలకు చేరుకున్న ప్రయాణికులు ఆయా దేశాల్లో కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి వెళ్లే వారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధన వర్తింంప చేయడం లేదు. మరోవైపు విదేశాల నుంచి విశాఖకు వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఈ పనులు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment