Uganda Woman
-
వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U — ANI (@ANI) December 29, 2021 -
నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది
కంపాలా: ఈ రోజుల్లో ఒక్క బిడ్డని పెంచి పోషించడమే చాలా మందికి చాలా కష్టంగా మారిపోతోంది. అలాంటిది ఉగాండాలో ఓ మహిళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 44 మందికి జన్మనిచ్చింది. ఏ మహిళలైనా నలభై ఏళ్లకే నలభైనాలుగు మంది పిల్లల్ని కనడాన్ని ఎవరూ నమ్మలేకపోవచ్చు. కానీ అసాధ్యమైన అంశాన్ని ఆమె సుసాధ్యం చేసింది. అయితే అది ఆమె ఇష్టంతో చేసిన పనికాదు. ఒకవైపు దయనీయ పరిస్థితి, మరోవైపు తన శరీరంలో జన్యువుల అసాధారణ స్థితి. ఆమెను 44 మంది పిల్లలకు తల్లిని చేశాయి. ఆమె పేరు మరియమ్ నబాటాంజీ. నివాసముండేది అత్యంత వెనుకబడిన ఉగాండాలోని ముకనో జిల్లాలో. ఆమెకు 12 ఏళ్లకే వివాహమైంది. గత రెండు దశాబ్దాలలో ఏటా కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. ఇప్పుడు ఆ సంఖ్య 44 మందికి పెరిగింది. దీంతో ఆమె ఆ దేశంలో ఓ సరికొత్త రికార్డును నమోదు చేశారు. మొట్ట మొదటి సంతానం 12 ఏళ్లకే సంభవించింది. తొలి సంతానమే కవలలు. అతంటితో ఆగకుండా ప్రతి ఏడాది పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఆమెకే ఎందుకిలా జరుగుతుందనే దానిపై దేశంలోని ప్రముఖ వైద్యలంతా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైన కేసుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఆమె ఒవేరియన్ పెద్దదిగా ఉండడమే దానికి కారణమని తెలిపారు. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకునే అవకాశం ఉన్నా, అది అంత క్షేమకరం కాదనీ, ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో కుటుంబ నియంత్రణ పాఠించలేదు. సాధారణంగా ఆఫ్రికాలో సరాసరిన ఓ మహిళ ఐదు నుండి ఆరుగురు పిల్లల వరకూ జన్మనిస్తుంటుంది. ప్రపంచ సగటు ఈ విషయంలో 2.4 మాత్రమేననీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమె కన్న 44 మంది పిల్లల్లో ఆరుగురు రకరకాల కారణాల వల్ల చనిపోగా, ప్రస్తుతం 38 మంది జీవించి ఉన్నారు. తన జీవితంలో ఇంతమంది పిల్లల్ని కనే విషయంపై ఆమె మాట్లాడుతూ 'నాకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. అప్పటికే నా భర్త వయసు 28 సంవత్సరాలు. చిన్నప్పుడు చాలా పేదరికం అనుభవించాను. మాకు తిండి లేని సమయంలో అన్నంలో గాజుముక్కలు కలిపి తినిపించి పిల్లల్ని చంపేసింది. నేను మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నన్ను బలవంతంగా ఓ వ్యక్తికి కట్టబెట్టారు. ఆయన నన్ను లైంగిక బానిసగా మార్చేశాడు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 18 మంది పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని భావించానని, కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల అది వీలుపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తోబుట్టువులను కోల్పోయిన నబతాంజీ తన పిల్లల్లోనే తన తోబుట్టువులను చూసుకోవాలని అనుకుంది. 38 మంది పిల్లలతో కనీస వసతులు సరిగా లేని ఓ ఇంట్లో ధైర్యంగా జీవిస్తోంది. ప్రతీరోజూ 25 కిలోల మైజ్ ఫ్లోర్ ఆహారంగా ఆ కుటుంబానికి అవసరం. చేపలు, మాంసం చాలా చాలా అరుదుగా మాత్రమే తింటారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. శనివారం అందరూ కలిసి పని చేసుకుంటారట. పిల్లలందర్నీ అలా చూస్తుంటే తాను జీవితంలో పడ్డ కష్టాలన్నింటినీ మర్చిపోతానంటోంది నబతాంజీ. రెండేళ్ల కిందట ఆమెకు కుటుంబ నియంత్రణ చికిత్స చేశారు. -
భారతి మెడకు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలపై ఆఫ్రికన్ మహిళలపై మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా మరో ఉగాండా మహిళ కోర్టును ఆశ్రయించింది. తమపై దాడి చేసిన మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్ చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం కలిశారు. మంత్రి సోమనాథ్ భారతిపై ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి పదవి నుంచి సోమనాథ్ భారతిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.