gold bars
-
సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం
సింగపూర్: సింగపూర్ అడ్డాగా చేసుకుని హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి బంగ్లాలు, కార్లు, నగదు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సింగపూర్ పోలీసులు. సింగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆర్చార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుండి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని అన్నారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ వాహనాలు, 23 మిలియన్ సింగపూర్ డాలర్లు(140 కోట్ల) నగదు కట్టలు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగులు, నగలు బంగారు బిస్కెట్లు.. మొత్తంగా రూ. 4491 కోట్ల ఆస్తులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుండి 44 వయస్సు మధ్యలో ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వారిని చైనా, కంబోడియా, సిప్రాస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠాలో సిప్రాస్ కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకగా అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు పోలీసులు. ఈ ముఠా ఆన్లైన్లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాముల తోపాటు ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపింది. ఈ ముఠాకి సహకరించిన ఆర్ధిక సంస్థలను ఉపేక్షించేది లేదని తెలిపింది. ఈ సందర్బంగా పోలీసు శాఖలోని వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ డేవిడ్ చ్యు మాట్లాడుతూ మీరు దొరికితే మిమ్మల్ని అరెస్టు చేస్తాం, అక్రమంగా సంపాదించిన మీ ఆస్తులు దొరికితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12% మాత్రమే విదేశీ నగదు వృద్ధి చెందగా కేవలం సింగపూర్ లోనే విదేశీ ధన ప్రవాహం 16% వృద్ధి చెందింది. అందుకే సింగపూర్ పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. ఇది కూడా చదవండి: భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి.. -
మోదీ ఫోటోతో గోల్డ్, సిల్వర్ బిస్కెట్లు..
సూరత్ : ధనత్రయోదశి సందర్భంగా సూరత్‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన బంగారు, వెండి కడ్డీలు విక్రయిస్తున్నారు. మోదీ బొమ్మతో రూపొందిన గోల్డ్ బార్లను పెద్ద సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని జ్యూవెలర్ చెబుతున్నారు. ప్రతి దీపావళికి లక్ష్మీదేవి, గణేష్‌లను కొలుస్తారని, ప్రధాని మోదీ కూడా తమకు భగవంతుడేనని, ఈ ఏడాది ప్రధాని మోదీ బొమ్మతో కూడిన గోల్డ్, సిల్వర్ బార్లను కొనుగోలు చేసి పూజిస్తామని ఓ కస్టమర్ చెబుతున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో దివాళీ సందర్భంగా ఆయన బొమ్మతో బంగారు, వెండి కడ్డీలు రూపొందిచాలనే ఆలోచన తనకు కలిగిందని జ్యూవెలరీ షోరూం యజమాని మిలన్ చెప్పుకొచ్చారు. గతంలోనూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల ఫోటోలతో మిలన్ గోల్డ్ రాఖీలను తయారుచేశారు. 22 కేరట్ల బంగారంతో తయారుచేసిన ఈ కాఖీలు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని ఆయన వెల్లడించారు. -
శేఖర్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : తమిళనాడు ఇసుక క్వారీల వ్యాపారంలో చక్రం తిప్పి, మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న శేఖర్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనవి, ఆయన బంధువులకు సంబంధించిన రూ.8.56 కోట్ల విలువైన 30కేజీల గోల్డ్ బార్స్ ను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల మేరకు పాత నోట్లను కొత్త నోట్లకు మార్చుకునే కేసుకు సంబంధించి రెడ్డి, ఆయన బంధువుల రూ.8,56,99,350 విలువైన 30కేజీల గోల్డ్ బార్స్ ను అటాచ్ చేస్తున్నామని ఏజెన్సీ జోనల్ ఆఫీసు సోమవారం ప్రొవిజనల్ అటాచ్ మెంట్ ఆర్డర్ జారీచేసిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ మనీ నిర్మూలనలో భాగంగా కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం శేఖర్ రెడ్డి మనీ లాండరింగ్ పాల్పడి ఐటీ డిపార్ట్ మెంట్ తనిఖీల్లో పట్టుబడ్డారు. తమిళనాడుతో సహా దేశమంతటా శేఖర్ రెడ్డి వ్యవహారం సంచలనం రేపింది. ఐటీ దాడుల్లో రూ.142 కోట్ల అక్రమ ఆదాయం ఉన్నట్టు తేలింది. రూ.34కోట్ల కొత్త నోట్లను, రూ.97 కోట్ల పాత నోట్లను, 177 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈయన్ని బోర్డు సభ్యుడిగా తీసేసింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. -
పాదాలకు పసిడి బిస్కెట్లు అతికించుకుని..
ముంబై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్గర్లు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చేందుకు రకారకాలుగా ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడొకరు 12 బంగారపు బిస్కెట్లతో ముంబై విమానాశ్రయంలో ఏఐయూ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న వీటి ధర రూ. 36,45,600గా అధికారులు అంచనా వేశారు. వీటిని తరలించేందుకు నిందితుడు అనుసరించిన విధానం చూసి అధికారులు అవాక్కయ్యారు. 12 బంగారపు బిస్కెట్లను రెండు కాళ్ల పాదాలకు అతికించుకుని ఏమీ ఎరగనట్టు విమానం దిగాడు. ఒక్కో పాదానికి ఆరేసి బిస్కెట్లు అంతికించాడు. అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బండారం బట్టబయలైంది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెత్తకుండీలో రెండు కిలోల బంగారం
ముంబై: చెత్తకుండీలో కిలోల బంగారం లభ్యమవడం ముంబై ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల పక్కనే ఉన్న టాయ్‌లెట్ లోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. బయటకు వచ్చిన తర్వాత అతడి కదలకలపై అనుమానం వచ్చిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. టాయ్లెట్లో కిలో బరువైన రెండు బంగారు బిస్కట్లను దాచినట్లు నిందితుడు పోలీసుల విచారణంలో వెల్లడించాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెత్తకుండీలో ఉన్న రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమిళనాడులో భారీగా బంగారం పట్టివేత !
-
87 బంగారు కడ్డీలు స్వాధీనం
చెన్నై: తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపుళ్లి రైల్వే గేట్ సమీపంలో రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీలంక నుంచి తరలిస్తున్న 8.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో అధికారులు తనిఖీలు జరపగా డ్రైవర్ సీటు కింద ఉన్న బ్యాగులో 87 బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఇవన్నీ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా ఉంది. ఒక్కొక్కటీ 100 గ్రాముల బరువుంది. దీంతో 8.7 కిలో బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.44 కోట్లని తెలిపారు. కారు డ్రైవర్ ముజిబుర్ రెహమాన్‌ను అరెస్టు చేసి మధురై జైలుకు తరలించారు. ఇవన్నీ శ్రీలంక నుంచి పడవలో తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. -
విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం
ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం బిస్కట్లు పట్టుబడ్డాయి. ఒక మహిళా ప్రయాణికురాలు అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. తనిఖీల్లో భాగంగా సుమారు 64 లక్షల విలువ చేసే బంగారం బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అధిక సంఖ్కలో గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని, వీటివిలువ సుమారు 64, 38,960 విలువ వుంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి, ఆ మహిళను ప్రశ్నిస్తున్నామన్నారు. -
దొంగ నుంచి బంగారం దొంగిలించిన ఆర్మీ కల్నల్
ఐజ్వాల్: ఓ స్మగ్లర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించని ఓ సీనియర్ ఆర్మీ అధికారి అసోం రైఫిల్స్ కు చెందిన మరో ఎనిమిదిమంది పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని పట్టుకొని తిరిగి దాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో వారిని ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.14.5కోట్లు ఉంటుందని అంచనా. ఐజ్వాల్‌లో 2014 డిసెంబర్ నెలలో మయన్మార్ నుంచి బంగారాన్ని దొంగరవాణా చేస్తున్న సీ లాల్నున్ ఫెలా అనే వ్యక్తి వాహనాన్ని కల్నల్ జాసిత్ సింగ్, మరో ఎనిమిది మంది కలసి అడ్డుకున్నారు. వీరిలో ఒకరకు జూనియర్ కమిషనర్ రేంజ్ అధికారి కూడా ఉన్నాడు. వారు తొలుత కారును ఆపేశారు. తమ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తూనే సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వారికి మొత్తం రూ.14.5కోట్ల విలువ చేసే 52 బంగారు కడ్డీలు లభించాయి. అనంతరం వారి కార్లలో వాటిని పెట్టుకొని అతడిని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అసలు తమకు ఎవరూ బంగారం అప్పగించలేదని చెప్పిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని ఆర్మీ యూనిట్ పై అనుమానం వచ్చి గత నెల(ఏప్రిల్ 21) కేసు ఫైల్ చేసి కల్నల్ సింగ్ ను దర్యాప్తునకు సహకరించాలని కోరారు. కానీ, ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునేందుకు వెళ్లడంతో పోలీసులు అరెస్టు చేశారు. -
వాషింగ్ మెషిన్లో 2 కిలోల బంగారం...
ముంబై: రెండు కిలోల బంగారం బిస్కట్ల స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. బంగారు బిస్కట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ముంబై ఎయిర్ పోర్టు నిఘా విభాగం(ఏఐయూ) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 19 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మహమ్మద్ అస్లాం షేక్ అనే వ్యక్తి రియాద్ నుంచి భారత్ కు వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో అధికారులు రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీలు చేస్తుండగా అతని వద్ద ఉన్న వాషింగ్ మెషిన్ లో ఏదో అనుమానిత వస్తువులు ఉన్నట్లు గమనించారు. వాషింగ్ మేషిన్ ను పరిశీలించి చూడగా ఒక్కొక్కటిగా 19 గోల్డ్ బిస్కట్లు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు రెండు కిలోలకు పైగా ఉందని, విలువ దాదాపు అరవై లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారు బిస్కట్లను మరో వ్యక్తిని తాను అప్పగించాల్సి ఉందని, అతని పేరు సల్మాన్ ఖాన్ అని చెప్పాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అస్లాం షేక్ కోసం ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్న సల్మాన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది అన్న కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టమామని ఎయిర్ పోర్టు నిఘా విభాగం అధికారులు వివరించారు. -
బంగారం కడ్డీలు మింగేశాడు
చెన్నై : మలేషియా నుంచి తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయానికి ప్రైవేటు విమానం మంగళవారం సాయంత్రం చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఒకరిని స్కాన్ యంత్రం ద్వారా తనిఖీ చేయగా అలారం వినిపించింది. అతన్ని అధికారులు ప్రత్యేక గదికి తీసుకువెళ్లి తనిఖీలు చేశారు. అయితే దుస్తులో ఏమీ కనిపించలేదు. దీంతో అతడిని ప్రత్యేకంగా విచారించారు. పట్టుబడిన వ్యక్తి తిరుచ్చి ఆళ్వార్తోపు ప్రాంతానికి చెందిన అబ్దుల్ లహాబ్ (55)గా తెలిసిం ది. అతడు మూడు లక్షల రూపాయల విలువైన 60 గ్రాముల బంగారాన్ని కడ్డీలు గా మార్చి మింగినట్లు తెలిసింది. దీంతో బంగారాన్ని వెలికితీసేందుకు అతన్ని తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లా రు. అక్కడ అతనితో అరటి పండ్లు మిం గించి ప్రత్యేక చికిత్స ద్వారా బంగారాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్కూల్ లాకర్లలో బంగారపు కడ్డీలు
అహ్మదాబాద్: స్కూల్ లాకర్లలో బంగారపు కడ్డీలు, భారీగా డబ్బు బయట పడిన ఆశ్చర్యకర ఘటన అహ్మదాబాద్ లో వెలుగు చూసింది. చంద్రఖేదలోని ఓఎన్ జీసీ క్యాంపస్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో వాడకంలో లేని లాకర్లలో వీటిని కనుగొన్నారు. లాకర్లలో కోటి రూపాయల నగదు, రూ. 59. లక్షల విలువచేసే బంగారం గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా వాడకంలోని 20 లాకర్లను గుర్తించిన ప్రిన్సిపాల్ అవదేశ్ కుమార్ వాటిని శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వీటిలో 5 లాకర్లకు తాళాలు లేకపోవడంతో వాటిని బద్దలు కొట్టారు. రెండు లాకర్ల నుంచి బ్యాగులు బయటపడ్డాయి. ఇందులో 100 గ్రాముల బరువున్న 21 బంగారపు కడ్డీలు బయటపడ్డాయి. దీంతో పిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ లాకర్లు ఎవరు వినియోగించారన్న సమాచారం దొరకలేదు. ఈ బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు సిబ్బందిని ప్రశ్నించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు పన్నుఎగవేత కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.