బంగారం కడ్డీలు మింగేశాడు
చెన్నై : మలేషియా నుంచి తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయానికి ప్రైవేటు విమానం మంగళవారం సాయంత్రం చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఒకరిని స్కాన్ యంత్రం ద్వారా తనిఖీ చేయగా అలారం వినిపించింది. అతన్ని అధికారులు ప్రత్యేక గదికి తీసుకువెళ్లి తనిఖీలు చేశారు.
అయితే దుస్తులో ఏమీ కనిపించలేదు. దీంతో అతడిని ప్రత్యేకంగా విచారించారు. పట్టుబడిన వ్యక్తి తిరుచ్చి ఆళ్వార్‌తోపు ప్రాంతానికి చెందిన అబ్దుల్ లహాబ్ (55)గా తెలిసిం ది. అతడు మూడు లక్షల రూపాయల విలువైన 60 గ్రాముల బంగారాన్ని కడ్డీలు గా మార్చి మింగినట్లు తెలిసింది. దీంతో బంగారాన్ని వెలికితీసేందుకు అతన్ని తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లా రు. అక్కడ అతనితో అరటి పండ్లు మిం గించి ప్రత్యేక చికిత్స ద్వారా బంగారాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.