శేఖర్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ
శేఖర్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ
Published Mon, May 29 2017 7:32 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
న్యూఢిల్లీ : తమిళనాడు ఇసుక క్వారీల వ్యాపారంలో చక్రం తిప్పి, మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న శేఖర్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనవి, ఆయన బంధువులకు సంబంధించిన రూ.8.56 కోట్ల విలువైన 30కేజీల గోల్డ్ బార్స్ ను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల మేరకు పాత నోట్లను కొత్త నోట్లకు మార్చుకునే కేసుకు సంబంధించి రెడ్డి, ఆయన బంధువుల రూ.8,56,99,350 విలువైన 30కేజీల గోల్డ్ బార్స్ ను అటాచ్ చేస్తున్నామని ఏజెన్సీ జోనల్ ఆఫీసు సోమవారం ప్రొవిజనల్ అటాచ్ మెంట్ ఆర్డర్ జారీచేసిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది.
బ్లాక్ మనీ నిర్మూలనలో భాగంగా కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం శేఖర్ రెడ్డి మనీ లాండరింగ్ పాల్పడి ఐటీ డిపార్ట్ మెంట్ తనిఖీల్లో పట్టుబడ్డారు. తమిళనాడుతో సహా దేశమంతటా శేఖర్ రెడ్డి వ్యవహారం సంచలనం రేపింది. ఐటీ దాడుల్లో రూ.142 కోట్ల అక్రమ ఆదాయం ఉన్నట్టు తేలింది. రూ.34కోట్ల కొత్త నోట్లను, రూ.97 కోట్ల పాత నోట్లను, 177 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈయన్ని బోర్డు సభ్యుడిగా తీసేసింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
Advertisement
Advertisement