sekhar reddy
-
విజన్ 2047 డబ్బా తర్వాత ముందు నీ బాదుడు ఆపు బాబు
-
నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన
‘నీ కాళ్లు మొక్కుత సారు..పైసలిప్పియ్యరూ.. అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో జరిగింది. బస్వాపురం గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు ఉడుత అంజయ్య అక్కడికి వచ్చాడు. రిజర్వాయర్ నిర్మాణంతో తన వ్యవసాయ భూమి, బోరు పోయిందని పైసలు ఇప్పించాలని ఎమ్మెల్యే కాళ్లపై పడి దండం పెట్టి వేడుకున్నాడు. చదవండి: (అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్) -
శేఖర్‌రెడ్డి డైరీలో పన్నీర్‌సెల్వం పేరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి చెందిన డైరీలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రుల పేర్లు ఉన్న సంగతి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గతేడాది నవంబర్‌లో తమిళనాడులో శేఖర్‌రెడ్డి, అతని భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీశాఖ చేసిన దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, స్థిర, చరాస్తుల పత్రాలు బయటపడ్డాయి. వీటితో పాటు ఓ డైరీని కూడా అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో శేఖర్‌రెడ్డికి అంతర్గత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆనాటి వివరాలను నిర్ధారిస్తున్నట్లుగా పలు అంశాలను ఒక ప్రైవేటు ఆంగ్ల టీవీ చానల్ శుక్రవారం ప్రసారం చేసింది. డైరీలోని కొన్ని పేజీలు తమచేతికి వచ్చాయని చెప్పింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు విజయభాస్కర్, ఎంసీ.సంపత్, తంగమణి, ఆర్పీ ఉదయకుమార్, దిండుగల్లు శ్రీనివాసన్, ఎంఆర్ విజయభాస్కర్, కేసీ కరుప్పన్నన్‌ల పేర్లు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు శేఖర్‌రెడ్డి డైరీ ద్వారా వెలుగుచూసిన వివరాలపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. -
‘సీఎం’ల బినామీ శేఖర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో సాగుతున్న ఇసుక అమ్మకాలు అక్రమాల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలకు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి బినామీ కథనాయకుడని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. శేఖర్రెడ్డికున్న రాజకీయ అండదండల వల్లనే రూ.33.6 కోట్ల విలువైన కొత్త కరెన్సీ ఆయనకు ఎలా దక్కిందనే విషయం బయటకు రావడం లేదని స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎస్ కంపెనీ పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు గత ఏడాది డిసెంబరు 8వ తేదీన దాడులు నిర్వహించి రూ.170 కోట్ల నగదు, రూ.178 కిలోల బంగారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్ల కొత్త కరెన్సీ ఉండడం కేసు తీవ్రతను పెంచింది. శేఖర్‌రెడ్డి చేతికి ఇంత భారీ మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందో తమకు తెలియదని సీబీఐకి ఆర్బీఐ సమాధానం చెప్పడం మరింత కలకలం రేపింది. ఈ కేసు విచారణపై స్టాలిన్ స్పందిస్తూ, ఆర్బీఐ అదుపాజ్ఞల్లో పనిచేసే కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకుల ద్వారా మాత్రమే శేఖర్‌రెడ్డి భారీ మొత్తంలో సొమ్ము ముట్టే అవకాశం ఉంది, అయితే ఆ సొమ్ము ఎలా చేరిందో తమకు తెలియదని ఆర్బీఐ చెప్పడం ఆశ్చర్యమే కాదు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కరెన్సీ ముద్రణాలయాలు కేంద్రప్రభుత్వం, కర్ణాటక, పశ్చిమబెంగాల్లోని ముద్రణాలయాలు ఆర్బీ ఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయని ఆయన అన్నారు. రూ. 33.6 కోట్లు ఏ ప్రెస్, బ్యాంకు నుంచి శేఖర్‌రెడ్డికి చేరా యో సీబీఐ కనుగొనలేక పోవడం నమ్మశక్యంగా లేదని అన్నారు. శేఖర్‌రెడ్డి కేసులో ఆధారాలు దొరకలేదు, రాష్ట్రంలో గుట్కా అక్రమ అమ్మకాల విచారణలో ఐటీ అధికారులు అందజేసిన ప్రకటన కనపడటం లేదు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటైనర్ ద్వా రా రూ.570 కోట్ల రవాణా అయిన సంగతి ఎన్నికల కమిషన్‌కు,ఆర్బీఐకి తెలియకపోవడం విచిత్రమన్నారు. ఐటీ అధికారుల దాడులన్నీ అంతరంగికం తమిళనాడుకు సంబంధించి ఐటీ అధికారులు జరిపిన దాడులన్నీ అంతరంగికంగా మారడం గమనార్హమని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలోని అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ పథకం ప్రకారం అటకెక్కడంపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ పరిస్థితుల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంల అక్రమార్జనకు శేఖర్‌రెడ్డి బినామీ కథానాయకుడన్న సంగతిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్థిక అవకతవకలపై తమ పార్టీ వచ్చేనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌డే అనుసరిస్తుండగా, తమకు పోటీగా అదే రోజున దేశవ్యాప్తంగా నల్లధన నిర్మూల దినం పాటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికేనని విమర్శించారు. శేఖర్‌రెడ్డికి రూ.33.6 కోట్లు ఎలా వచ్చాయా తెలియని స్థితిలో ఆర్బీఐ ఉన్నపుడు కేంద్రప్రభుత్వ నల్లధన నిర్మూలన ఏ రీతిలో సాగుతోందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. శేఖర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమార్జనలపై జరిపిన ఐటీ దాడులపై వెంటనే చర్య తీసుకునేలా నల్లధన నిర్మూలనం రోజున కేంద్రం ఒక ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే, శేఖర్‌రెడ్డికి రూ.2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయనే వివరాలను ఆర్బీఐ అధికారులు వెంటనే సీబీఐకి అందజేసి చార్జీషీటు దాఖలుకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
శేఖర్ రెడ్డికి ప్రాణభయం!
♦ కిడ్నాప్‌చేసి హత్య చేయాలని కుట్ర ♦ చెన్నై పుళల్‌జైల్లో ఖైదీల వ్యూహం ♦ రాజకీయ నేతల హస్తం ♦ బందోబస్తు కోసం వినతి అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో చక్రం తిప్పిన ప్రముఖ ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. తనకు, తన కుటుంబానికి కొందరినుంచి ప్రాణహాని ఉన్నందున తగిన బందోబస్తు కల్పించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఆయన వినతిపత్రం సమర్పించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: శేఖర్‌రెడ్డిని కిడ్నాప్ చేసి హత్యచేసేందుకు వ్యూహరచన చేసినట్టు అధికారులు నిర్ధారించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రజా పన్నుల శాఖలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తిగా శేఖర్‌రెడ్డి ఎదిగారు. ఇసుక కాంట్రాక్టరుగా కోట్లాది రూపాయలు గడించారు.గత ఏడాది డిసెంబరులో చెన్నై, వేలూరు జిల్లాల్లోని శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులుచేయడం.. సుమారు రూ.120 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారు, వెండి నగలు వస్తువులను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఐటీ దాడుల్లో పట్టుబడిన నగదులో రూ.33 కోట్లు ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లు కావడం కలకలం రేపింది.పెద్ద నోట్ల రద్దు కారణంగా స్వల్ప మొత్తాలు సైతం బ్యాంకుల్లో అందుబాటులో లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో శేఖర్‌రెడ్డి వద్ద ఏకంగా కోట్లాది రూపాయలు దొరకడం ఐటీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన నేరం కింద ఐటీ శాఖతోపాటు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా వేరుగా కేసును నమోదుచేసి విచారణ చేస్తోంది. శేఖర్‌రెడ్డితోపాటు ఆయన వ్యాపార భాగస్వాములను కూడా అరెస్ట్‌చేసి పుళల్ జైల్లో పెట్టారు. శేఖర్‌రెడ్డి అరెస్టయి నెలలు దాటుతున్నా ఐటీ, ఈడీ అధికారులు చార్జిషీటు పెట్టకపోవడంతో మద్రాసు హైకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. హతమార్చేందుకు కుట్ర : శేఖర్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన శేఖర్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా, శేఖర్‌రెడ్డిని కిడ్నాప్‌చేసి హత్య చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నట్లు వెల్లడైంది. దేశంలోని ప్రముఖులను కిడ్నాప్‌చేసి హతమార్చే ఖరీదైన క్రిమినల్ గ్యాంగ్‌కు శేఖర్‌రెడ్డి వ్యవహారాన్ని అప్పగించినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌లోని కొందరు చెన్నై పుళల్‌జైల్లో ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఆ గ్యాంగ్ కదలికలపై నిఘాపెట్టిన జైలు అధికారులు శేఖర్‌రెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ విషయాన్ని ఢిల్లీలో ఉన్న శేఖర్‌రెడ్డికి చేరవేసి అప్రమత్తంగా ఉండమని సూచించారు. అధికారుల సూచన తరువాత తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున తగిన భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు శేఖర్‌రెడ్డి వినతి పత్రం పంపారు. అయితే ఆయనకు ఎటువంటి భద్రత కల్పించలేదు. క్రిమినల్ గ్యాంగ్ ఆటలు కట్టించేందుకు చర్యలు కూడా చేపట్టలేదు. ఇదిలా ఉండగా, పుళల్‌జైల్లో ఉన్న క్రిమినల్ గ్యాంగ్ తమవారిని ములాఖత్ కింద జైలుకు పిలిపించుకుని కిడ్నాప్, హత్యపై వ్యూహరచన సాగించినట్లు తెలుసుకున్న అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మరోసారి ఆయనకు సూచించారు. దీంతో శేఖర్‌రెడ్డి మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు భద్రత కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఆ విజ్ఞప్తిని స్వీకరించిన ఢిల్లీ పోలీసులు సోమవారం తొలిదశ విచారణను ప్రారంభించారు. అలాగే తమిళనాడు హోంశాఖ కార్యదర్శి సైతం శేఖర్‌రెడ్డి విజ్ఞప్తిని డీజీపీకి పంపారు. భద్రతకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని ఆయన పోలీసుశాఖకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో శేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు పోలీస్ బందోబస్తు ఏర్పాటవుతుందని భావిస్తున్నారు. హత్య వెనుక అసలు ఉద్దేశం పుళల్ జైల్లోని కొందరు ఖైదీల వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని శేఖర్‌రెడ్డి చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు తలెత్తాయి. ఆయనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఎందరో రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమిళనాడు ఇసుక అమ్మకాలు, ప్రభుత్వ పనుల టెండర్లు పొందడంలో ఆయన కొందరు రాజకీయనేతలకు వాటాలు ఇస్తుంటారని సమాచారం. శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేసినపుడు రాజకీయనేతలతో సంబంధాలపై ఆధారాలు దొరికినట్లు అధికారులే చెబుతున్నారు. ఇంటిపై దాడుల తరువాతనే రాష్ట్రంలో అనేక సంచలన దాడులు చోటుచేసుకున్నాయి. శేఖర్‌రెడ్డి నోరుతెరిస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో పుళల్జైలులోని ఖైదీల సహాయంతో కిడ్నాప్, హత్యకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. అంతేగాక ఆయనను బెదిరించి భారీ ఎత్తున సొమ్మును రాబట్టేందుకు కూడా ఈ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చని అంటున్నారు. శేఖర్‌రెడ్డి కిడ్నాప్, హత్యకు కుట్ర వ్యవహారంపై తమిళనాడు పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ ప్రారంభించారు. -
శేఖర్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : తమిళనాడు ఇసుక క్వారీల వ్యాపారంలో చక్రం తిప్పి, మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న శేఖర్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనవి, ఆయన బంధువులకు సంబంధించిన రూ.8.56 కోట్ల విలువైన 30కేజీల గోల్డ్ బార్స్ ను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల మేరకు పాత నోట్లను కొత్త నోట్లకు మార్చుకునే కేసుకు సంబంధించి రెడ్డి, ఆయన బంధువుల రూ.8,56,99,350 విలువైన 30కేజీల గోల్డ్ బార్స్ ను అటాచ్ చేస్తున్నామని ఏజెన్సీ జోనల్ ఆఫీసు సోమవారం ప్రొవిజనల్ అటాచ్ మెంట్ ఆర్డర్ జారీచేసిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ మనీ నిర్మూలనలో భాగంగా కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం శేఖర్ రెడ్డి మనీ లాండరింగ్ పాల్పడి ఐటీ డిపార్ట్ మెంట్ తనిఖీల్లో పట్టుబడ్డారు. తమిళనాడుతో సహా దేశమంతటా శేఖర్ రెడ్డి వ్యవహారం సంచలనం రేపింది. ఐటీ దాడుల్లో రూ.142 కోట్ల అక్రమ ఆదాయం ఉన్నట్టు తేలింది. రూ.34కోట్ల కొత్త నోట్లను, రూ.97 కోట్ల పాత నోట్లను, 177 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈయన్ని బోర్డు సభ్యుడిగా తీసేసింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. -
టీటీడీ బోర్డు శేఖర్‌రెడ్డి మరోసారి అరెస్ట్
-
ఐటీ ఉచ్చులో మరో ఐఏఎస్ అధికారి
-
ఐటీ ఉచ్చులో మరో ఐఏఎస్ అధికారి
ముగ్గురు శేఖర్‌రెడ్డి అనుచరుల అరెస్ట్ చెన్నై: ఐటీ అధికారుల ఉచ్చులో మరో ఐఏఎస్ అధికారి పడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లవరంలో నివసిస్తున్న తమిళనాడు గోడౌన్స్ మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజన్ ఇంటిపై 3 రోజుల క్రితం ఐటీ అధికారులు దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని రూ.1.5 కోట్ల కొత్త కరెన్సీ, 6 కిలోల బంగారం ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక మంత్రికి నాగరాజన్ సన్నిహితుడు కావడంతో ఆ మంత్రి సొమ్ము ఇంకా ఉండొచ్చని ఐటీ అధికారులు అనుమానిస్తున్నా రు. కాగా, శేఖర్‌రెడ్డి బృందంలోని ఆడిటర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, ఇసుక కాంట్రాక్టర్ దిండుగల్లు రత్నం, పుదుకోట్టై రామచంద్రన్‌లను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులను అరెస్ట్ చేసి ఎగ్మూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా వచ్చేనెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శేఖర్‌రెడ్డిని 15 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. -
అలాంటి వారిని టీటీడిలో ఎలా నియమిస్తారు ?
-
చిన్న కాంట్రాక్టర్‌గా మొదలు పెట్టి..
-
శేఖర్‌రెడ్డి కారులో భారీగా నగదు స్వాధీనం
-
ఆస్పత్రిలో జయలలిత కోసం తిరుపతి లడ్డూ!
అన్నీ కొత్త నోట్లతో 170 కోట్ల నగదు, ఇంకా 130 కిలోల బంగారంతో పట్టుబడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి పెద్ద పెద్ద వాళ్లతో మంచి పరిచయాలు మెయిన్టైన్ చేసేవాడని తెలుస్తోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. ఆయన స్వయంగా ఆస్పత్రికి వెళ్లి, తిరుపతి లడ్డూ కూడా తీసుకెళ్లారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వంతో కూడా ఈయనకు మంచి సంబంధాలే ఉన్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం పన్నీర్ సెల్వం తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లినప్పుడు కూడా ఆయన వెంటే ఉండి.. స్వయంగా ఆలయంలోకి తీసుకెళ్లింది సైతం ఈ శేఖర్ రెడ్డేనట. వీళ్లిద్దరికీ ఉన్న సంబంధం ఏంటని అన్నాడీఎంకే వర్గాలను ప్రశ్నించగా.. ఆయన టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో వచ్చారే తప్ప పన్నీర్ సెల్వంకు ఆయనతో సంబంధం ఏమీ లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ లోగుట్టు పెరుమాళ్లకెరుక!