
ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న ఉడుత అంజయ్య
‘నీ కాళ్లు మొక్కుత సారు..పైసలిప్పియ్యరూ.. అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో జరిగింది. బస్వాపురం గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు ఉడుత అంజయ్య అక్కడికి వచ్చాడు. రిజర్వాయర్ నిర్మాణంతో తన వ్యవసాయ భూమి, బోరు పోయిందని పైసలు ఇప్పించాలని ఎమ్మెల్యే కాళ్లపై పడి దండం పెట్టి వేడుకున్నాడు.
చదవండి: (అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment