Airport officials
-
ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికులు అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు తరుచూ రావడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం చూపించారు. అది కూడా ప్రయాణికుడికి సంబంధించిన బ్యాగ్ నుంచి డబ్బులు, వస్తువులు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. అయితే జూన్ 29న జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా వెలుగులోకి చ్చింది. అసలేం జరిగిందంటే.. మియామి ఎయిర్‌పోర్టులోని చెక్ పాయింట్ వద్ద ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ప్రయాణికుల సామాన్లను భద్రపరుస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ స్కానర్ మెషిన్‌పై ఉంచిన బ్యాగ్‌లో నుంచి 600 డాలర్లను కాజేశారు. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ.. ఎవరికి కనపడకుండా మెల్లగా ఆ డబ్బులను బ్యాగ్ నుంచి కాజేసి తన జేబులో వేసుకున్నారు. డబ్బులతోపాటు ఇతర వస్తులను సైతం దొంగిలించాడు. TSA Agents caught on surveillance video stealing hundreds of dollars in cash from passengers’ bags at Miami airport. pic.twitter.com/LhFW9yNRNV — Mike Sington (@MikeSington) September 13, 2023 ఈ దృశ్యాలన్నీ ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రయాణికుల వస్తువులు కనిపించకపోవడంతో.. అక్కడున్న సెక్యురిటీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితులను టీఎస్ఏ సిబ్బంది 20 ఏళ్ల జోస్యు గొంజాలెజ్, 33 ఏళ్ల లాబారియస్ విలియమ్స్‌గా గుర్తించారు. వారిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులు కలిసి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు రోజు దాదాపు వెయ్యి డాలర్లు దొంగిలించినట్లు అంగీకరించారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ముగ్గురిని స్క్రీనింగ్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించమని, చోరీకి పాల్పడిన వారిని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించామని టీఎస్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
నేడు గన్నవరం, విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు
గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రారంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్‌లన్నీ రద్దయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సోమవారం నుంచి సర్వీస్‌లు ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే చివరి నిమిషం వరకూ ప్రయాణికుల విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కు పంపించాలా? లేదా? అనే విషయంపై స్పష్టత లేక సోమవారం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన నాలుగు ఇండిగో, ఒక ఎయిర్ ఆసియా విమాన సర్వీసులు నిలిచిపోనున్నట్లు విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజా కిశోర్ తెలిపారు. రెండు ఎయిర్‌పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రేణిగుంట నుంచి ఓకే.. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్ర విమానయాన శాఖ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు డైరెక్టర్ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు, 8.50 గంటలకు బెంగళూ రు నుంచి ఇక్కడికి ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొ న్నారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు, 11.55 గంటలకు రేణి గుంట నుంచి కొల్హాపూర్‌కు రాకపోకలు కొనసాగుతాయని తెలియజేశారు. హైదరాబాద్ నుంచి 140 విమానాలు హైదరాబాద్: శంషాబాద్ నుంచి ఆదివారం అర్ధరాత్రి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం నుంచి జూన్ 30 వరకు విమానాల షెడ్యూల్‌ను ఎయిర్పోర్ట్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. -
వసీం అక్రమ్‌కు ఘోర అవమానం
మాంచెస్టర్: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్‌కు మాంచెస్టర్ విమానశ్రయంలో ఘోర అవమానం ఎదురైంది. ఇన్సులిన్ విషయంలో విమానశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని, పబ్లిక్‌లో తనపై గట్టిగా అరిచారని ట్విటర్ వేదికగా అక్రమ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాంచెస్టర్ విమానశ్రయంలో జరిగిన సంఘటనతో తీవ్ర నిరాశ చెందాను. నేను అనేక దేశాలు ఇన్సులిన్ వెంటబెట్టుకునే వెళ్లాను. కానీ ఈ రోజు అదే ఇన్సులిన్‌తో మాంచెస్టర్‌లో ఘోర అవమనానికి ఎదురయ్యాను. దీనికి సంబంధించి అధికారులు నన్ను పబ్లిక్‌లో గట్టిగా ప్రశ్నించారు, నాపై అరిచారు. అధికారుల కారణంగా కోల్డ్ కేస్‌లో ఉండాల్సిన ఇన్సులిన్ చెత్త బుట్టలో పడ్డాయి’అంటూ అక్రమ్ ట్వీట్ చేశాడు. కాగా, వసీం అక్రమ్ ట్వీట్‌కు మాంచెస్టర్ ఎయిర్‌పోర్టు అఫిషియల్స్ స్పందించారు. ‘థ్యాంక్యూ వసీం. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు. దీనిపై విచారిస్తాం. మీరు మాకు డైరెక్ట్‌గా మెసెజ్ చేస్తే.. మరింత సమాచారం తీసుకోగలం’అంటూ ఎయిర్పోర్ట్ అఫిషియల్స్ ఆక్రమ్కు తెలిపారు. ‘త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు. మీకు కాంటాక్ట్‌లో ఉంటాను’అంటూ అక్రమ్ రిట్వీట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అక్రమ్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. టోర్నీ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న అతడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. 104 టెస్టులు, 356 వన్డేలు ఆడినే ఆక్రమ్.. పాక్ సాధించిన అనేక చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. -
కడుపులో 6 బంగారు బిస్కెట్లు
- మలేసియా నుంచి అక్రమంగా తరలించేందుకు యువకుడి యత్నం - నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుచ్చి ఎయిర్పోర్ట్ అధికారులు కేకే.నగర్ (చెన్నై): కడుపులో బంగారు బిస్కెట్లు దాచుకుని వచ్చిన యువకుడిని విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి ఏయిర్ ఏషియా విమానం ఆదివారం సాయంత్రం వచ్చింది. విమానంలో వచ్చిన ప్రయాణికుల వద్ద అధికారులు తనిఖీలు జరుపుతుండగా, ఓ యువకుడిపై అనుమానం రావడంతో అతడిని విచారించారు. ఆయన మలేసియా నుంచి తిరుచ్చికి కడుపులో ఆరు బంగారు బిస్కెట్లు ఉంచుకుని వచ్చినట్లు విచారణలో తేలింది. నిందితుడు రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణానికి చెందిన మహ్మద్ ముస్తఫా సలీంగా అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు ముస్తఫాను తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స ద్వారా బంగారు బిస్కెట్లు వెలికితీయాలని వైద్యులకు సూచించారు. వైద్యులు ఒక బంగారు బిస్కెట్ మాత్రమే వెలికి తీయగలిగారు. మరో ఐదు బిస్కెట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
భారీ వర్షంతో.. విమానాల దారి మళ్లింపు
చెన్నై: చెన్నై విమానశ్రయంలో లాండ్ అవ్వాల్సిన మూడు విమానాలను భారీ వర్షం కారణంగా దారిమళ్లించినట్టు విమానశ్రయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నైలో ధారాపాతంగా వర్షం కురుస్తుండటంతో రెండు అంతర్జాతీయ విమానాలు, ఒక దేశియ విమానాన్ని బెంగళూరు, తిరుచునాపల్లి విమానశ్రయాలకు మళ్లించారు. అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు శనివారం పూణె నుంచి ఒక దేశియ విమానం, సింగపూర్, ప్రాంక్పర్ట్ నుంచి రెండు అంతర్జాతీయ విమానాలు రావాల్సి ఉంది. చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ మూడింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు పేర్కొన్నారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఈ మూడు విమానల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులంతా సిద్ధంగా ఉండగా, చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దాంతో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. -
ఎయిర్‌పోర్టు సర్వే అధికారులను అడ్డుకున్న భోగాపురంవాసులు
విజయనగరం (భోగాపురం) : సోమవారం తొలి ఏకాదశి కావడంతో మంచి రోజన్న కారణంతో ఎయిర్‌పోర్టు భూముల సర్వేకు వెళ్లిన అధికారులను ముక్కాం గ్రామ సమీపంలో భోగాపురం మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. వారు వెంట తీసుకువచ్చిన మ్యాపులను చించి వేసి అధికారులను అడ్డుకున్నారు. మేము ఎలాంటి భూమలు ఇవ్వబోమని, మరోసారి ఎయిర్‌పోర్టు భూమల సర్వే కోసం వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
మహిళనుంచి నాలుగున్నర కేజీల బంగారం స్వాధీనం
చెన్నై: సింగపూర్ నుంచి విమానంలో చెన్నై వచ్చిన ఓ మహిళను ఎయిర్‌పోర్టు అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన ఆమె వద్ద వస్తువులను తనిఖీ చేశారు. ఆమె వద్ద నుంచి నాలుగున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
సెల్ఫోన్లలో బంగారం స్మగ్లింగ్
చెన్నై, సాక్షి: బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సెల్ఫోన్లను ఆయుధంగా మార్చుకున్నారు స్మగ్లర్లు. సెల్ఫోన్లలో భద్రపరచి హాంకాంగ్ నుంచి చెన్నైకు తీసుకొచ్చిన 27 కిలోల బంగారు బిస్కెట్లను విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. హాంకాంగ్‌కు చెందిన రవాణా విమానం ద్వారా పెద్దమొత్తంలో బంగారం చేరవేస్తున్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన చెన్నై విమానాశ్రయ అధికారులు మంగళవారం గోదాములకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉన్న సెల్‌ఫోన్ కంటెయినర్లను అధికారులు తెరచిచూడగా బ్లాక్‌బెర్రీ సెల్ఫోన్లు కనిపించాయి. అయితే సెల్‌ఫోన్ కవర్ విప్పిచూడగా బ్యాటరీ ఉండాల్సిన చోట బంగారు బిస్కెట్ ఉంది. ఇలా 54 సెల్ఫోన్ల నుంచి మొత్తం 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 90 సెల్‌ఫోన్ కంటెయినర్లు ఉన్నాయని, వాటిని కూడా తెరిస్తే మరింత బంగారం దొరికే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.