కడుపులో 6 బంగారు బిస్కెట్లు | 6 gold biscuits in the stomach | Sakshi
Sakshi News home page

కడుపులో 6 బంగారు బిస్కెట్లు

Published Tue, Aug 22 2017 2:35 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

కడుపులో 6 బంగారు బిస్కెట్లు

కడుపులో 6 బంగారు బిస్కెట్లు

- మలేసియా నుంచి అక్రమంగా తరలించేందుకు యువకుడి యత్నం
నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు
 
కేకే.నగర్‌ (చెన్నై): కడుపులో బంగారు బిస్కెట్లు దాచుకుని వచ్చిన యువకుడిని విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్‌ నుంచి తిరుచ్చికి ఏయిర్‌ ఏషియా విమానం ఆదివారం సాయంత్రం వచ్చింది. విమానంలో వచ్చిన ప్రయాణికుల వద్ద అధికారులు తనిఖీలు జరుపుతుండగా, ఓ యువకుడిపై అనుమానం రావడంతో అతడిని విచారించారు. ఆయన మలేసియా నుంచి తిరుచ్చికి కడుపులో ఆరు బంగారు బిస్కెట్లు ఉంచుకుని వచ్చినట్లు విచారణలో తేలింది.

నిందితుడు రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణానికి చెందిన మహ్మద్‌ ముస్తఫా సలీంగా అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు ముస్తఫాను తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స ద్వారా బంగారు బిస్కెట్లు వెలికితీయాలని వైద్యులకు సూచించారు. వైద్యులు ఒక బంగారు బిస్కెట్‌ మాత్రమే వెలికి తీయగలిగారు. మరో ఐదు బిస్కెట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement