చెన్నై, సాక్షి: బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సెల్‌ఫోన్లను ఆయుధంగా మార్చుకున్నారు స్మగ్లర్లు. సెల్‌ఫోన్లలో భద్రపరచి హాంకాంగ్ నుంచి చెన్నైకు తీసుకొచ్చిన 27 కిలోల బంగారు బిస్కెట్లను విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. హాంకాంగ్‌కు చెందిన రవాణా విమానం ద్వారా పెద్దమొత్తంలో బంగారం చేరవేస్తున్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన చెన్నై విమానాశ్రయ అధికారులు మంగళవారం గోదాములకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో ఉన్న సెల్‌ఫోన్ కంటెయినర్లను అధికారులు తెరచిచూడగా బ్లాక్‌బెర్రీ సెల్‌ఫోన్లు కనిపించాయి. అయితే సెల్‌ఫోన్ కవర్ విప్పిచూడగా బ్యాటరీ ఉండాల్సిన చోట బంగారు బిస్కెట్ ఉంది. ఇలా 54 సెల్‌ఫోన్ల నుంచి మొత్తం 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 90 సెల్‌ఫోన్ కంటెయినర్లు ఉన్నాయని, వాటిని కూడా తెరిస్తే మరింత బంగారం దొరికే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
సెల్‌ఫోన్లలో బంగారం స్మగ్లింగ్
Published Wed, Jan 29 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement