
ఎయిర్‌పోర్టు సర్వే అధికారులను అడ్డుకున్న భోగాపురంవాసులు
విజయనగరం (భోగాపురం) : సోమవారం తొలి ఏకాదశి కావడంతో మంచి రోజన్న కారణంతో ఎయిర్‌పోర్టు భూముల సర్వేకు వెళ్లిన అధికారులను ముక్కాం గ్రామ సమీపంలో భోగాపురం మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. వారు వెంట తీసుకువచ్చిన మ్యాపులను చించి వేసి అధికారులను అడ్డుకున్నారు.
మేము ఎలాంటి భూమలు ఇవ్వబోమని, మరోసారి ఎయిర్‌పోర్టు భూమల సర్వే కోసం వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.