
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రామాలకు సంబంధించి ఏపీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆర్టికల్ 131 చెల్లుబాటుపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోబోమని పేర్కొంటూ విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment