సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
Published Fri, Nov 11 2016 3:37 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
హైదరాబాద్: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిం చాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్‌కౌంటర్ ఘటనపై నిజనిర్ధారణ వివరాలను వెల్ల డించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను, ప్రజలను విచారించి వాస్త వాలను తెలుసుకున్నట్లు తెలిపారు.
మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారం తెలుసుకుని వారిని మట్టుపెట్టాలనే లక్ష్యంతోనే పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని, అందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. పోలీసులు పథకం ప్రకారం పాశవికంగా కాల్చి చంపారని, మృతదేహాలను గుర్తుపట్టకుండా శవాలను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ఆదివాసీలపై ఉక్కుపాదం మోపు తూ ప్రజల జీవన మనుగడను ప్రశ్నార్థకం చేస్తూనే, మరో పక్క అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఏపీ గ్రే హౌండ్‌స దళాలను రద్దు చేయాలని, అటవీ ప్రాంతంలో మోహరించిన పారా మిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కూంబింగ్ ఆపరేషన్‌స పూర్తిగా నిలిపి వేసి అటవీ హక్కు, పంచాయతీ చట్టాలను అమలు చేయాలని, బూటకపు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆదివాసీ కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Advertisement