అరకు దాడి ఆధారాలు దొరికాయ్‌ : డీజీపీ | DGP RP Thakur Visited Maoist Attack Spot In Dumbriguda In Visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 26 2018 5:54 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

DGP RP Thakur Visited Maoist Attack Spot In Dumbriguda In Visakhapatnam - Sakshi

మీడియాతో మాట్లాడుతున్నడీజీపీ ఆర్పీ ఠాకూర్‌

సాక్షి విశాఖపట్నం : విశాఖ మన్యం, అరకు లోయలో మావోయిస్టుల కదలికలు తగ్గిపోయినట్టు పోలీసు వర్గాలు ఎప్పుడూ చెప్పలేదని ఆంద్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం డుంబ్రిగూడ మండలం లిపిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యకు గురైన ప్రదేశాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. కాల్పుల్లో పాల్లొన్న వారి ఆధారాలు దొరికాయనీ, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దు (ఏఓబీ)లో సమస్యలున్నాయనీ, ఈ ఘటనపై ఒడిషా డీజీపీ ఆర్పీ శర్మతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో డీజీపీ ఇంటలిజెన్స్‌, విశాఖ జిల్లా ఎస్పీ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement